రెంట్‌ కోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది.. స్టార్‌ హీరో మాజీ భార్య! | Kiran Rao recalls Her struggle not making enough money for rent | Sakshi
Sakshi News home page

Kiran Rao: ఆ జాబ్ వల్లే ముంబయిలో బతికా: కిరణ్ రావు

Jun 3 2024 6:57 PM | Updated on Jun 3 2024 7:17 PM

Kiran Rao recalls Her struggle not making enough money for rent

బాలీవుడ్‌ డైరెక్టర్‌ కిరణ్ రావు ఇటీవల లపత్తా లేడీస్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఏకంగా రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్‌  మూవీని దాటేసింది. కొద్ది రోజుల్లోనే టాప్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అమిర్‌ ఖాన్‌ మాజీ భార్య అయిన కిరణ్‌ రావు 2010లో ధోబీ ఘాట్‌ మూవీతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె ఇండస్ట్రీలో తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. ముంబయిలో బతికేందుకు చాలా ఉద్యోగాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అధిక జీవన వ్యయాన్ని తట్టుకునేందుకు రెండు, మూడు ఉద్యోగాలు చేశానని వెల్లడించారు.

కిరణ్ రావు మాట్లాడుతూ..'ముంబయిలో ఖర్చులు ఎక్కువ కావడంతో చాలా ఉద్యోగాలు చేశా. కేవలం ఇంటి అద్దె  కోసమే అడ్వర్‌టైజింగ్‌ సంస్థల్లో పనిచేశా. లగాన్‌ లాంటి ఫీచర్ ఫిల్మ్‌కు పని చేసినప్పుడు నాకు ఎలాంటి డబ్బులు రాలేదు. అడ్వర్‌టైజింగ్‌ జాబ్స్‌తో వచ్చే డబ్బుతోనే ముంబయిలో నివసించా. ఆ ఉద్యోగాల వల్లే  కంప్యూటర్లు, కారు వంటి  ఖరీదైన వస్తువులు కొన్నా. మా నాన్న నుంచి లక్ష రూపాయలకు మొదటి కారు కొన్నా' అని తెలిపింది. కాగా.. కిరణ్‌ రావు.. హీరో అమిర్‌ ఖాన్‌కు పెళ్లైన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. 

Advertisement
 
Advertisement
Advertisement