Actress Sangeeta Odwani Shares About Her Experience Of Facing Casting Couch, Deets Inside - Sakshi
Sakshi News home page

Sangeeta Odwani: ఆ నిర్మాతకు అమ్మాయిల పిచ్చి.. ఒంటరిగా ఇంటికి రమ్మన్నాడు

May 24 2023 12:33 PM | Updated on May 24 2023 12:50 PM

Sangeeta Odwani Share Her Casting Couch Experience - Sakshi

చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందనేది అందరికి తెలిసిన పచ్చి నిజం. ఈ సమస్య ఇప్పుడే కాదు దశాబ్దాల కాలం నుంచి ఉంది.అయితే ఈ మధ్య కాలంలో పలువురు హీరోయిన్స్‌ తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి బహిరంగంగా వెళ్లడిస్తున్నారు. చాలా మంది లైగిక వేధింపుల పై పోరాటం కూడా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటి, ‘శుభ్ మంగళ్ మే దంగల్’ ఫేం సంగీతా ఒడ్వాని తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్‌ కౌచ్‌ ఓపెన్‌ అయింది. ఓ స్టార్‌ నిర్మాత తనను ఒంటరిగా ఇంటికి పిలిచాడని ఓ ఇంటర్వ్యూలో తెలిసింది.

‘కెరీర్‌ తొలినాళ్లలో నాకు ఇండస్ట్రీ కల్చర్‌ గురించి పెద్దగా తెలియదు.  అందరితో సరదాగా ఉండేదాన్ని. కొన్నాళ్ల తర్వాత పైకి మంచి వాడిలా నటించే ఓ స్టార్‌ నిర్మాత నాతో మిస్‌ బిహేవ్‌ చేశాడు. ఓ రోజు ఓ ప్రాజెక్ట్‌ గురించి  చర్చించాలని ఇంటికి ఆహ్వానించాడు. ఒంటరిగా మాత్రమే రావాలని పదే పదే చెప్పడంతో నాకు డౌట్‌ వచ్చింది.
(చదవండి: హీరోయిన్‌ రంభ కూతురిని చూశారా? అచ్చం తల్లిలాగే ఉందిగా!

ఎందుకైనా మంచిదని నా ఫ్రెండ్స్‌ని తీసుకొని ఆయన ఇంటికి వెళ్లాను.అయితే నేను సింగిల్‌గా వెళ్లకపోవడంతో అతనికి కోపం వచ్చింది. అర్జంట్‌గా వేరే పని పడిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కూడా నన్ను ఒంటరిగా కలిసేందుకు ప్రయత్నించాడు. కానీ నేను దూరం పెట్టేశాను. అతనికి అమ్మాయిలు అంటే పిచ్చి. సినిమాల పేరుతో వారిని లొంగదీసుకుంటాడు’ అని సంగీత చెప్పుకొచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement