షారుఖ్‌ ఖాన్‌కూ బెదిరింపులు | Shah Rukh Khan Receives Threat Call From Unknown Person | Sakshi
Sakshi News home page

షారుఖ్‌ ఖాన్‌కూ బెదిరింపులు

Nov 7 2024 3:12 PM | Updated on Nov 8 2024 5:19 AM

Shah Rukh Khan Receives Threat Call From Unknown Person

ముంబై/రాయ్‌పూర్‌: బాలీవుడ్‌లోని మరో ప్రముఖ నటుడికి చంపేస్తామంటూ బెదిరింపు అందింది. సల్మాన్‌ ఖాన్‌కు ఇటీవల లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరుతో హెచ్చరికలు రావడం తెలిసిందే. అలాంటి హెచ్చరికే ఈసారి షారుఖ్‌ ఖాన్‌కు వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వకుంటే షారుఖ్‌ను చంపేస్తామంటూ బాంద్రా పోలీసుల సెల్‌ఫోన్‌కు మెసేజీ వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్‌ ఖాన్‌ అనే లాయర్‌ పేరుతో ఉన్న ఫోన్‌ నుంచి ఆ మెసేజీ వచ్చినట్లు గుర్తించారు. 

బలవంతపు వసూళ్లు సహా వివిధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో జరిగే విచారణకు రావాల్సిందిగా ఆయనకు నోటీసిచ్చారు. ‘షారుఖ్‌ ఖాన్‌కు వచ్చిన బెదిరింపు మెసేజీపై విచారణ కోసం ముంబై పోలీసులు గురువారం ఉదయం రాయ్‌పూర్‌కు వచ్చారు. బెదిరింపు మెసేజీ ఫైజాన్‌ పేరుతో రిజిస్టరైన ఫోన్‌ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఆ మేరకు రాయ్‌పూర్‌లోని పండ్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే ఫైజాన్‌ ఖాన్‌కు నోటీసు అందజేశారు’అని రాయ్‌పూర్‌ సీనియర్‌ ఎస్‌పీ సంతోష్‌ సింగ్‌ చెప్పారు. అయితే, ఆ మెసేజీ తాను పంపలేదని, తనపై ఎవరో కుట్ర చేస్తున్నారనిఫైజాన్‌ ఖాన్‌ తెలిపారు.  

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement