Trolls On A R Rahman: తమిళం మాట్లాడాలని కోరిన ఏఆర్ రెహమాన్.. నెటిజన్స్ ట్రోల్స్!

A R Rahman asks wife Saira Banu to speak in Tamil gets slammed by netizens - Sakshi

ఏఆర్‌ రెహమాన్‌.. ఆయన పేరే ఒక బ్రాండ్‌. సుమారు 30 ఏళ్ల క్రితం సంగీత దర్శకుడిగా పరిచయమై ప్రపంచస్థాయిలో తన సత్తా చాటారు. ఒకేసారి రెండు ఆస్కార్‌ అవార్డులను సాధించిన ఘనత రెహమాన్‌కే సొంతం. దేశంలోనే గొప్ప సంగీత దర్శకుడిగా ఎదిగారు. తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్లం సహా అనేక భాషల్లో ఆయన బాణీలు అందించారు. ఇప్పటికీ ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారంటే ఆ చిత్రం కచ్చితంగా మ్యూజికల్‌ హిట్‌ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇటీవల ఈయన సంగీతాన్ని అందించిన పొన్నియిన్‌ సెల్వన్, వెందు తనిందది కాడు చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి.

(ఇది చదవండి: సమంత డై హార్డ్ ఫ్యాన్‌.. ఏకంగా ఇంట్లోనే గుడి కట్టేస్తున్నాడు!)

అయితే ఇటీవల చెన్నైలో జరిగిన ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్- 2022 అవార్డ్‌ ఫంక్షన్‌కు తన భార్య సైరా భానుతో కలిసి ఆయన హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో రెహమాన్ చేసిన పనికి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే తన భార్య సైరా భానును హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడాలని రెహమాన్ సరదాగా కోరాడు.

(ఇది చదవండి: ఏఆర్‌ రెహమాన్‌ భార్యను ఎప్పుడైనా చూశారా?)

అయితే ఆమె తనకు తమిళం సరిగా రాదని.. సారీ చెబుతూ ఇంగ్లీష్‌లో మాట్లాడింది. నాకు రెహమాన్ వాయిస్ అంటే ఇష్టం. అది చూసే ప్రేమలో పడ్డాను' అంటూ మాట్లాడింది. అయితే తమిళంలో మాట్లాడాలంటూ తన భార్యకు రెహమాన్ చెప్పడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు.

కొందరేమో హిందీ భాషలోనే పాటలు పాడి సంపాదిస్తున్నావ్.. తమిళంలో మాట్లాడమని చెబుతావా అంటూ రెహమాన్‌ను తప్పుబడుతున్నారు. మరికొందరేమో హీందీ భాష దేశవ్యాప్తంగా మాట్లాడుతారని.. తమిళంలో కూడా హిందీ సాంగ్స్‌ ఫేమస్‌ అని చెప్పారు. ఏ భాషలో మాట్లాడాలనేది వారి వ్యక్తిగత అంశమని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ఏదేమైనా భారతదేశంలో అన్ని భాషలు సమానమేనని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top