Samantha die hard fan constructing temple in his home at Bapatla - Sakshi
Sakshi News home page

Samantha Die hard Fan: సమంతకు గుడి.. వీరాభిమాని బర్త్‌డే గిఫ్ట్‌!

Apr 26 2023 3:44 PM | Updated on Apr 26 2023 6:53 PM

Samantha Die hard Fan Construction Of a Temple at Bapatla In home - Sakshi

సినీ తారలకు అభిమానులు ఉండడం సహజం. సాధారణంగా వారికిష్టమైన హీరో లేదా హీరోయిన్‌ అంటే పడి చచ్చేంత అభిమానం. అభిమాన తారల సినిమా రిలీజ్‌ అయిందంటే వారి ఆనందానికి హద్దే ఉండదు. అంతలా సినీ తారలపై ఫ్యాన్స్ ప్రేమను చాటుకుంటారు. ఇక కొందరు వీరాభిమానులైతే అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక రూపంలో తమ ‍ప్రేమను చాటుకుంటూ ఉంటారు. తమ ఫేవరేట్ హీరో, హీరోయిన్లను దేవతల్లా కూడా భావిస్తారు. వారికేమైనా జరిగితే కూడా తట్టుకోలేరు. అంతలా ప్రేమను చూపిస్తారు ఫ్యాన్స్. తాజాగా ఓ వీరాభిమాని తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. 

(ఇది చదవండి: సిల్క్ ‍స్మిత సూసైడ్... ఆమెను చూసేందుకు వచ్చిన ఏకైక హీరో అతనే!)

సాధారణంగా హీరోలకు డైహార్డ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. కానీ తాజాగా ఓ వ్యక్తి తన అభిమాన హీరోయిన్‌ కోసం ఏకంగా గుడి కట్టేందుకు సిద్ధమవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న స్టార్ హీరోయిన్‌ సమంతకు డైహార్డ్‌ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ సమంత బర్త్‌డేకు వినూత్నంగా గిఫ్ట్ ఇవ్వనున్నాడు. తన ఇంటిలోనే సమంత విగ్రహం తయారు చేయించి గుడి కడుతున్నాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

(ఇది చదవండి: అప్పుడు నేను కోమాలో ఉన్నాను: విరూపాక్ష డైరెక్టర్‌)

అంతే కాకుండా సమంత వ్యాధి నుంచి కోలుకున్నందుకు ఇప్పటికే తిరుపతి, చెన్నై, నాగపట్నం, కడప దర్గాకు మొక్కుబడి  యాత్ర కూడా నిర్వహించినట్లు సందీప్ తెలిపారు. గతంలో కూడా ఓ వీరాభిమాని సీనియర్ నటి ఖుష్బూ సుందర్ కూడా ఇలాగే గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.  ఏదేమైనా సమంత బర్త్‌డేకు వీరాభిమాని గుడి కట్టడం విశేషంగా నిలవనుంది. ఈనెల 28న సమంత పుట్టినరోజు సందర్భంగా గుడి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. సమంత ఇటీవలే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement