AR Rahman shares pic with his wife Saira on wedding anniversary - Sakshi
Sakshi News home page

AR Rahman: ఏఆర్‌ రెహమాన్‌ భార్యను చూశారా? పెళ్లిరోజు ఫోటో షేర్‌ చేసిన మ్యూజిక్‌ డైరెక్టర్‌

Mar 13 2023 1:12 PM | Updated on Mar 13 2023 1:32 PM

AR Rahman Shares Pic With Wife Saira on Wedding Anniversary - Sakshi

ఏఆర్‌ రెహమాన్‌.. ఈ పేరే ఒక బ్రాండ్‌. సుమారు 30 ఏళ్ల క్రితం సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. దేశంలోనే అగ్ర సంగీత దర్శకుడిగా ఎదిగారు. తమిళం, తెలుగు, హిందీ, ఆంగ్లం సహా అనేక భాషల్లో ఆయన బాణీలు అందించారు. ఒకేసారి రెండు ఆస్కార్‌ అవార్డులను సాధించిన ఘనత ఈయనది. ఇప్పటికీ ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారంటే ఆ చిత్రం కచ్చితంగా మ్యూజికల్‌ హిట్‌ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇటీవల ఈయన సంగీతాన్ని అందించిన పొన్నియిన్‌ సెల్వన్, వెందు తనిందది కాడు చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం పత్తుతల, పొన్నియిన్‌ సెల్వన్‌ 2, మామన్నన్, లాల్‌ సలాం, ఆడుజీవితం వంటి పలు చిత్రాలు ఈయన చేతిలో ఉన్నాయి.

వీటిలో శింబు కథానాయకుడిగా నటించిన పత్తుతల చిత్రం ఈ నెల 30వ తేదీ తెరపైకి రానుంది. అదే విధంగా ఏప్రిల్‌ 28వ తేదీ పొన్నియిన్‌ సెల్వన్‌ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తరువాత మామన్నన్‌ చిత్రం రెడీ అవుతోంది. ఇలా ఈ ఏడాది.. నెలకో చిత్రంతో ఏఆర్‌ రెహమాన్‌ తన అభిమానులను అలరించనున్నారు. కాకపోతే ఏఆర్‌ రెహమాన్‌ సతీమణి గురించి చాలా తక్కువ మందికి తెలిసుంటుంది. ఈయన 1995 మార్చి 12వ తేదీ సైరా భానును వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితం 28 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏఆర్‌ రెహమాన్‌ తన సతీమణితో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చేశారు. దీంతో పలువురు వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ దంపతులకు ఖతీజా రెహమాన్, రహీమ రెహమాన్‌ అనే ఇద్దరు కుమార్తెలు, ఒమీన్‌ అనే కొడుకు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement