ఆ హీరో హోటల్‌కి వెళ్లాలంటేనే భయపడేదాన్ని ..: మీనా | Actress Meena Reveals Reason Behind Why She Not Able To Do Bollywood Films, Despite Offers From Mithun Chakraborty | Sakshi
Sakshi News home page

ఊటీలో ఆ హీరోకి హోటల్‌... వెళ్లాలంటే భయపడేదాన్ని : మీనా

Nov 8 2025 7:36 PM | Updated on Nov 8 2025 8:19 PM

Actress Meena Explained the reasons for not being able to do films in Bollywood

ఒకప్పుడు సౌత్ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో మీనా ఒకరు. చైల్డ్ఆర్టిస్ట్గా కెరీర్ని ప్రారంభించి, తర్వాత హీరోయిన్గా దక్షిణాది ఇండస్ట్రీలో వెలుగు వెలిగింది. తెలుగులో అప్పటి స్టార్హీరోలందరితోనూ సినిమాను చేసింది. తమిళ, కన్నడలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్ఉండేది. ఒకనొక దశలో ఒకే రోజు మూడు, నాలుగు సినిమాల షూటింగ్లకు హాజరయ్యేదట. ఇలా తెలుగు,కన్నడ,తమిళ, మలయాళంలో పలు సినిమాలు చేసిన మీనా(Meena).. హిందీలో మాత్రం పర్దా హై పర్దా అనే ఒకే ఒక మూవీ చేసింది. తర్వాత అవకాశాలు వచ్చినా..తాను చేయలేదట. స్టార్హీరో అయితే పలుమార్లు తనతో సినిమా చేయమని కోరినా.. చేయలేకపోయానని..ఒకనొక దశలో ఆయన ఉన్న హోటల్కి వెళ్లాలంటే భయపడ్డానని అంటోది మీనా. తాజాగా యూట్యూబ్చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో గురించి, తాను ఎందుకు బాలీవుడ్సినిమాలు చేయలేకపోయిందో వివరించింది.

తినడానికి కూడా టైం లేదు..
తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేశాను. అదే సమయంలో నాకు బాలీవుడ్ఆఫర్స్కూడా వచ్చాయి. కానీ చేయలేకపోయాను. ఇక్కడే నాకు తినడానికి, నిద్రపోవడానికి కూడా టైమ్దొరకలేదు. ఇక బాలీవుడ్సినిమాలు ఎలా చేస్తా. పైగా అక్కడ టైమ్కి షూటింగ్పూర్తి కాదని చెప్పారు. బాలీవుడ్లో ఒక్క సినిమా చేసేలోపు సౌత్లో నాలుగు సినిమాలు చేయొచ్చని చెప్పారు.అందుకే నేను బాలీవుడ్పై ఫోకస్చేయలేదు. పర్దా హై పర్దా తర్వాత ఆఫర్స్వచ్చినా తిరస్కరించా.

మిథున్ చక్రవర్తి అలా అడిగేవాడు
అప్పట్లో బాలీవుడ్హీరో మిథున్చక్రవర్తికి ఊటీలో ఒక హోటల్ఉండేది. సినిమా షూటింగ్స్అన్నీ అక్కడే జరిగేవి. నా సినిమా షూటింగ్కోసం అక్కడి వెళ్తే..అదే హోటల్లో ఉండేదాన్ని. అప్పుడు మిథున్చక్రవర్తి నా దగ్గరకు వచ్చి మరీ..‘నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్‌’ అని అడిగేవాడు. నాకు చేయాలనే ఉండేది..కానీ డేట్స్ఖాలీగా ఉండేవి కాదు. నేను వెళ్లిన ప్రతిసారి ఆయన నా గది దగ్గరకు వచ్చి మరీ అడిగేవాడు. నాకేమో డేట్స్ఖాలీగా ఉండేవి కాదు. ఒకానొక దశలో హీరో హోటల్కి వెళ్లాలంటేనే భయపడేదాన్ని. అంత పెద్ద స్టార్హీరోకి నో చెప్పలేక బాధపడేదాన్ని. ఎప్పుడైనా ఊటీకి వెళితే.. హోటల్వద్దు..వేరే హోటల్లో రూమ్బుక్చేయమని అడిగేదాన్ని. ఆయనకు నొ చెప్పాలంటే ఏదోలా అనిపించేందిఅని మీనా చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement