ఒంటరిగా ఉండలేను.. ఐశ్వర్య సలహానే పాటిస్తున్నా : అభిషేక్‌ | Abhishek Bachchan Recalls Wife Aishwarya Rai Advice On Dealing With Negativity | Sakshi
Sakshi News home page

ఒంటరిగా ఉండలేను.. ఐశ్వర్య సలహానే పాటిస్తున్నా : అభిషేక్‌

Jul 2 2025 2:49 PM | Updated on Jul 2 2025 3:36 PM

Abhishek Bachchan Recalls Wife Aishwarya Rai Advice On Dealing With Negativity

తనపై వచ్చే నెగెటివిటీని ఎదుర్కోవడానికి  భార్య ఐశ్వర్య ఇచ్చే సలహాను పాటిస్తున్నానని చెప్పారు బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌(Abhishek Bachchan). ఆమె ఇచ్చిన సలహాతో ఇప్పుడు పాజిటివ్‌ విషయాలపై మాత్రమే దృష్టిపెడుతున్నానని అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటుడిగా తనపై వచ్చే ఫేక్‌ న్యూస్‌, ట్రోలింగ్‌ని ఎలా ఎదుర్కొంటున్నాడో వివరించాడు. 

‘నా చుట్టు ఉన్నవారిని సంతోషంగా ఉంచాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. అలా చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ కొన్నిసార్లు కాలమే మనకు కఠినంగా ఉండమని చెబుతుంది. ఒక నటుడిగా అలా ఉండడం నాకు కుదరదు. అలా ఉంటే ఆ ప్రభావం నా కెరీర్‌పై పడుతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా సరే నలుగురిని సంతోషంగా ఉండేలా చేయాలనే మనస్తత్వం నాది. నెగెటివ్‌ విషయాలు చెప్పే వారి గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని, ట్రోలింగ్‌పై కూడా దృష్టిపెట్టేవాడిని. కానీ నా భార్య ఇచ్చిన ఒక సలహాతో వాటిని దూరం పెట్టేశాను.

‘తప్పుడు వార్తలు మనపై ఎలాంటి ప్రభావం చూపవు. పాజిటివ్‌ విషయాలపై మాత్రమే దృష్టిపెట్టండి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది’ అని ఐశ్వర్య నాకు సలహా ఇచ్చింది. ఇప్పుడు అదే నేను ఫాలో అవుతున్నాను. ట్రోలింగ్‌ని పట్టించుకోకుండా  ఎంజాయ్‌ చేస్తున్నాను. ఒంటరిగా ఎక్కువ రోజులు ఉండడం నా వల్ల కాదు. కుటుంబాన్ని చూడకుండా ఉండలేను. నా పక్కన మాట్లాడడానికి ఒక మనిషి కచ్చితంగా ఉండాలి. ఇంట్లో అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటాం. వర్క్‌ బిజీగా గడుపుతున్నప్పటికీ అప్పుడప్పుడు మనకోసం కూడా సమయం కేటాయించుకోవాలి’ అని అభిషేక్‌ అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన కాళిధర్‌ లాపత మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. జీ 5’ వేదికగా జులై 4 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement