ఇండియాలో అమ్ముడయ్యేది ఆ రెండే.. హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్! | Raj Kundra Comments On Two Things Sell In Only In India Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

Raj Kundra: ఆ రెండింటికే మనదేశంలో డిమాండ్.. శిల్పాశెట్టి భర్త షాకింగ్ కామెంట్స్!

Oct 18 2023 6:23 PM | Updated on Oct 18 2023 6:57 PM

Raj Kundra Comments On Two Things Sell In Only In India Shah Rukh Khan - Sakshi

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా చాలా రోజుల తర్వాత తన మొహాన్ని ప్రేక్షకులను చూపించారు. ఆయన నటించిన  తాజా చిత్రం యూటీ69.  తన జీవితం ఆధారంగానే ఈ బయోపిక్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా  యూటీ69 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రాజ్‌ కుంద్రా మాట్లాడారు. వారికి అడిగిన ప్రశ్నలకు  సమాధానాలిచ్చారు. 

ముంబయిలో జరిగిన ఈవెంట్‌కు హాజరైన రాజ్‌కుంద్రా మీడియా ప్రతినిధులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండియాలో రెండు మాత్రమే ప్రధానంగా అమ్ముడవుతాయి.. అందులో ఒకటి షారుక్‌ ఖాన్ అయితే.. మరొకటి శృంగారం అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత నా మొహాన్ని మీడియాకు చూపించారు. ఇన్ని రోజులు ఎక్కడ చూసినా మాస్క్ లేదా హెల్మెట్ ధరించి కనిపించారు. 

అంతే కాకుండా పోర్న్ కేసు తన కుటుంబంపై చాలా ప్రభావం చూపిందని తెలిపారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా రాజ్‌ కుంద్రా ఫుల్ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తాను జైలులో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని అన్నారు.  

రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'ఇది నాకు కేవలం సినిమా మాత్రమే కాదు. నా జీవితం ఎంతో అయోమయంగా మారింది. అందులోని ఒక భాగాన్ని ఈ సినిమా ద్వారా మీతో పంచుకుంటున్నా.' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 3న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. 2021లో పోర్న్ కేసులో రాజ్ కుంద్రా అరెస్టైన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలపాటు జైలులో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement