Vicky Kaushal-Salman Khan: విక్కీ కౌశల్‌ ఎదురుపడినా పట్టించుకోని సల్మాన్‌ ఖాన్‌.. బాడీగార్డ్స్‌ దురుస ప్రవర్తన

Salman Khan Security Pushes Vicky Kaushal At IIFA Event - Sakshi

బాలీవుడ్‌ హీరో, కత్రినా కైఫ్‌ భర్త విక్కీ కౌశల్‌కు చేదు అనుభవం ఎదురైంది. అబుదాబీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమంలో విక్కీ కౌశల్‌పై బాడీగార్డ్స్‌తో పాటు సల్మాన్‌ కూడా దురుసుగా ప్రవర్తించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. IIFA 2023 అవార్డు వేడుకకి పలువురు బాడీవుడ్‌ స్టార్స్‌ సందడి చేశారు.

ఈ క్రమంలో ఓ అభిమానితో విక్కీ సెల్ఫీ దిగుతుండగా సల్మాన్‌ ఖాన్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన అక్కడికి రావడంతో సల్మాన్‌ బాడీగార్డ్స్‌ అత్యుత్సాహంతో విక్కీ కౌశల్‌ను పక్కకు నెట్టివేశారు. అయినా సరే పెద్దగా పట్టించుకోని విక్కీ సల్మాన్‌ను పలకరించేందుకు ముందుకు వెళ్లగా సల్మాన్‌ మాత్రం ఏమీ పట్టనట్లుగా, సరిగా మాట్లాడకుండానే వెళ్లిపోయాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. సల్మాన్‌ఖాన్‌ బాడీగార్డ్స్‌ ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు. అంతేకాకుండా తోటి నటుడితో ఎలా ప్రవర్తించాలో కూడా సల్మాన్‌కు తెలియదా? అంత మర్యాద లేదా అంటూ అతడి తీరుపై కూడా ఫైర్‌ అవుతున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top