గతవారం 'ఫంకీ' సినిమాతో వచ్చిన విశ్వక్ సేన్.. ఘోరమైన ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. ఊహించిన దానికంటే ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఇంతలోనే మరో మూవీతో వచ్చేందుకు విశ్వక్ రెడీ అయిపోయాడు. 'కల్ట్' పేరుతో తీసిన ఈ చిత్రంలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా చేశాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: సుహాస్‌కి కలిసొచ్చింది.. 'హే బలవంత్' కలెక్షన్ ఎన్ని కోట్లంటే?)
టీజర్ బట్టి చూస్తే ఓ ముగ్గురు కుర్రాళ్లు.. గోవాకి వెళ్తారు. కానీ పబ్‌లోకి వెళ్లేందుకు ఎంట్రీ దొరకదు. దీంతో 'కల్ట్' అనే చోటుకి వెళ్తారు. ఈ గేమ్‌లో భాగంగా స్క్రీన్ పై ఓ బొమ్మ కనిపిస్తుంది. లోపల ఉన్నవాళ్లందరికీ కొన్ని గేమ్స్ పెడుతూ ఉంటుంది. అందులో ఫెయిలైన వాళ్లు ఎలిమినేట్ అవుతుంటారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే చంపేయడం. మరి ఈ 'కల్ట్' సంగతేంటి? ఇందులో విశ్వక్ పాత్ర ఏంటనేది తెలియాలంటే ట్రైలర్, మూవీ వచ్చేవరకు ఆగాల్సిందే. టీజర్ చూడగానే చాలామంది 'స్క్విడ్ గేమ్' సిరీస్ గుర్తుకురావడం గ్యారంటీ. ఎందుకంటే అందులోనూ ఇలానే గేమ్‌లో ఎలిమినేట్ అయితే చంపేస్తుంటారు.
(ఇదీ చదవండి: లెస్బియన్ కాన్సెప్ట్ సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)


