
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో అభిమానులను అలరించారు. గతనెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 2018లో రిలీజైన సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
అయితే సినిమాల సంగతి పక్కనపెడితే.. అమిర్ ఖాన్ ఇంటికి ఐపీఎస్ అధికారులు రావడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అమిర్ ఇంటికి ఐపీఎస్ అధికారులు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ అసలు ఎందుకు వచ్చారని ఆరా తీస్తున్నారు. అంతమంది ఐపీఎస్ అధికారులు రావడానికి కారణాలపై చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్ టీమ్ స్పందించింది. ఐపీఎస్ అధికారుల ఆకస్మికంగా అమిర్ ఇంటికి రావడంపై కచ్చితమైన వివరాలు తెలియవని అమిర్ టీమ్ తెలిపింది. మేము కూడా అమిర్ ఖాన్ సంప్రదించి పూర్తి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు. అయితే ప్రస్తుతం శిక్షణలో ఉన్న ఐపీఎస్ శిక్షణార్థులు ఆమిర్ ఖాన్‌తో సమావేశం అయ్యారని సమాచారం. వారందరికీ హీరో తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారని ఆ బృందంలోని ఒక సభ్యుడు వెల్లడించినట్లు తెలుస్తోంది.