నటుడి నగ్న ఫోటోలు.. మీరు అలా ఎందుకు చేయకూడదు? | Actor Vidyut Jammwal Breaks Silence On His Viral Photos On Social Media Being Trolled, Deets Inside - Sakshi
Sakshi News home page

Vidyut Jammwal Viral Photos Controversy: నగ్న ఫోటోలపై ట్రోల్స్‌.. గర్వంగా ఉందన్న హీరో!

Published Wed, Feb 21 2024 5:24 PM

Vidyut Jammwal breaks silence on his viral photos Viral On Social Media - Sakshi

గతంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నగ్నంగా ఓ మేగజైన్‌ కవర్‌ ఫోటోగా ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ విషయంపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయితే ఆయన బాటలోనే మరో బాలీవుడ్ నటుడు కనిపించి అందరికీ షాకిచ్చాడు. గతేడాది విద్యుత్ జమ్వాల్ తన పుట్టిన రోజు సందర్భంగా హిమాలయల్లో నగ్నంగా కనిపిస్తూ ఉన్న ఫోటోలను పంచుకున్నారు. అతని ఫోటోలపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వచ్చాయి. కొందరు విమర్శించగా.. మరికొందరు మద్దతుగా పోస్టులు పెట్టారు. తాజాగా విద్యుత జమ్వాల్‌ ఆ ఫోటోలపై స్పందించారు. అలా ఉండడం తనకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. 

విద్యుత్ జమ్వాల్‌ మాట్లాడుతూ..' నాకు సొంత పనులు చేయడం అంటే చాలా ఇష్టం. నాకు నచ్చినట్లు లైఫ్‌ను ఎంజాయ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. ఇష్టమైన పుస్తకాన్ని చదవడం చాలా ఇష్టం. మీరు చూసిన ఈ ఫోటోలు నేను గత 14 ఏళ్లుగా సందర్శించిన వాటిలో ఒక భాగం మాత్రమే. ఈ విషయంలో నేను గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరూ నగ్నంగా ఉండి తమ కోసం సమయం ఎందుకు కేటాయించకూడదు. మీరు అలా చేస్తే ఈ ప్రపంచంలో సిగ్గుపడని ఏకైక వ్యక్తి మీరు మాత్రమే.' అని అన్నారు. 

మీ నగ్న చిత్రాలపై వచ్చిన కామెంట్స్‌ బాధించాయా అని ప్రశ్నించగా.. 'ఇలాంటి చిన్న విషయాలు కేవలం దోమ కుట్టినట్లుగా మాత్రమే అనిపిస్తాయని అన్నారు. ఇలాంటి విమర్శలు నన్ను ఏ విధంగా బాధించవని చెప్పారు. ఎందుకంటే అది తన గురించి ఒకరి అభిప్రాయం మాత్రమేనని కొట్టిపారేశారు. కాగా.. విద్యుత్ జమ్వాల్‌ ప్రస్తుతం క్రాక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
Advertisement