కన్నీళ్లు పెట్టుకున్న మహిళ అభిమాని.. అక్షయ్ కుమార్‌ ఏం చేశారంటే? | Akshay Kumar takes charge as Housefull 5 Pune event | Sakshi
Sakshi News home page

Akshay Kumar: 'చేతులెత్తి నమస్కరిస్తున్నా.. అర్థం చేసుకోండి': అక్షయ్ కుమార్

Jun 2 2025 1:45 PM | Updated on Jun 2 2025 2:57 PM

Akshay Kumar takes charge as Housefull 5 Pune event

బాలీవుడ్ స్టార్ అక్షయ్‌ కుమార్‌ మరోసారి అభిమానులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు వచ్చేస్తున్నాడు. ఆయన నటించి తాజా చిత్రం హౌస్‌ఫుల్-5. ఈ కామెటీ ఎంటర్‌టైనర్ సిరీస్‌లో వస్తోన్న ఐదో చిత్రం కావడం విశేషం. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో అక్షయ్‌ కుమార్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పుణెలోని ఓ మాల్‌లో ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్‌ పెద్దఎత్తున తరలివచ్చారు.

అయితే ఊహించని విధంగా మహిళలు, చిన్నపిల్లలు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. అదే సమయంలో అక్షయ్ కుమార్ వేదికపై మాట్లాడుతుండగా తోపులాట జరిగింది. ‍అభిమానులు తోసుకోవడంతో ఓ మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసిన అక్షయ్ కుమార్‌ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ఇక్కడ మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు.. దయచేసి ఎవరూ కూడా తోసుకోవద్దు అంటూ అభిమానులను కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఏడుస్తున్న ఆ మహిళ అభిమానిని హీరోయిన్లు బజ్వా, ఫెర్నాండెజ్  కౌగిలించుకుని ఓదార్చారు. కాగా.. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, నానా పటేకర్, జాక్వెలిన్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రీ, సౌందర్య శర్మ, ఫర్దీన్ ఖాన్‌ కీలక పాత్ర‍ల్లో నటించారు. ఈ సినిమా జూన్ 6న థియేటర్లలో విడుదల కానుంది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement