ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తుంటాయి. ఈ వారం కూడా అఖండ 2, అయలాన్, దే దే ప్యార్ దే 2, వెపన్స్, మాస్క్, ప్రీడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఓ హాలీవుడ్ మూవీ తెలుగు డబ్బింగ్ కూడా సడన్‌గా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో'.. తెలుగు రివ్యూ)
హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు 'ట్రాన్' ఫ్రాంచైజీ గురించి తెలిసే ఉంటుంది. 1982లో మొదటగా 'ట్రాన్' మూవీ వచ్చింది. 2010లో 'ట్రాన్: లెగసీ' పేరుతో మరో సినిమా రిలీజైంది. గతేడాది అక్టోబరులో 'ట్రాన్: ఏరిస్' పేరుతో మూడోది ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటిలో స్టోరీ పరంగా పెద్దగా మెరుపులేం లేనప్పటికీ విజువల్ వండర్ అనేలా సీన్స్ ఉంటాయి. మూడో పార్ట్.. గత నెలలోనే అమెజాన్ ప్రైమ్‌లోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉచితంగానే చూడొచ్చు. ఈ సినిమాలో ఏఐ అనేది మంచిదా కాదా అనే అంశాన్ని చర్చించడం విశేషం.
'ట్రాన్: ఏరిస్' విషయానికొస్తే.. ఎన్‌కామ్, డీలింగర్ అనే రెండు కంపెనీలు ఉంటాయి. వీళ్లు ఏఐ(కృత్రిమ మేధ) టెక్నాలజీ ఉపయోగించి ఒకరు ప్రజలకు మంచి చేయాలనుకుంటారు. మరొకరు ఆర్మీ, సైనికులని తయారు చేయాలనుకుంటారు. అయితే ఏఐ ఉపయోగించి ఓ సైనికుడిని తయారు చేస్తారు. అతడే ఏరిస్. మంచి కోసం ప్రాణాలకు తెగించే సైనికుడు. ఇతడి నాశనమైపోయినా సరే మరోదాన్ని సృష్టించుకోవచ్చు. అయితే ఏరిస్‌కి మనిషిలా బతకాలనే కోరిక పుడుతుంది. ఎమోషన్స్ వస్తాయి. అలాంటి టైంలో ఓ దాని గురించి వెతుకుతుంటాడు. అలానే ఈ రెండు కంపెనీలకు ఓ ప్రోగ్రామ్, ఆల్గారిథమ్ కూడా కావాల్సి వస్తుంది. ఇంతకీ అవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. స్టోరీతో పనిలేదు విజువల్స్ బాగుంటే చాలానుకుంటే దీన్ని చూడొచ్చు.
(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన 'అయలాన్' తెలుగు వెర్షన్)


