బంగాళాఖాతంలో అల్పపీడనం
● 16 జిల్లాలో నేడు వానలు
సాక్షి, చైన్నె : బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడన ద్రోణి శనివారం బయలు దేరింది. ఈ ప్రభావంతో తెన్‌కాశి, తిరునల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి, నాగపట్నం జిల్లాలో అనేకచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇది 24వ తేదిన వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలోని దక్షిణ తమిళనాడు, డెల్టాతో పాటుగా 16 జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం అనేక చోట్ల పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నాలుగు రోజుల పాటూ వర్షాలు కొనసాగుతాయని వివరించారు. తెన్‌కాశి, తిరునల్వేలిలో వర్షాలతో వాగులు , వంకలు,నదులు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాలలో కుండపోతగా నీరు పడుతోంది. కుట్రాలం జలపాతంలో సందర్శలకు అనుమతి రద్దు చేయడంతో అయ్యప్ప దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తులు ఇక్కడ స్నానం చేయలేని పరిస్థితి నెలకొంది.
ఇంధన పరిరక్షణపై
విస్తృతంగా ప్రచారం
సాక్షి, చైన్నె : ఇంధ పరిరక్షణపై జాతీయ స్థాయిలో ప్రచారం విస్తృతం చేయడం లక్ష్యంగా విద్యార్థులకు చిత్ర లేఖనంపోటీలు జరిగాయి. విద్యుత్‌మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వలో తమళనాడు వ్యాప్తంగా 40 వేల మంది విద్యార్థుళకు పోటీలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి చిత్ర లేఖన పోటీలలో విజేతలకు అన్నావర్సిటీ ఆవరరణలో బహుమతులను అందజేశారు. అన్నావర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ ఆర్‌శరవణన్, పవర్ గ్రిడ్ సీనియర్ డీజీఎం ఎంఎం జయశీలన్ తదితరులు హాజరై విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ ప్రచారాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా సూచనలు ఇచ్చారు. యువ మనస్సులలో శక్తి పరిరక్షణ గురించి అవగాహన పెంపునకు, స్థిరమైన పద్ధధులను ప్రోత్సహించేందుకు , కళాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, యువ ప్రతిభలో దాగిన సృజనాత్మకతను వెలికి తీసే విధంగా పోటీలు జరిగాయి. కేటగిరి ఏ, బీ వారీగా విజేతలను ప్రకటించి, బహుమతులను అందజేశారు. ఈ విజేతలుకు డిసెంబరు 12వ తేదీన జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొననున్నారు.
హక్కులను వదులు కోం!
సాక్షి, చైన్నె : డీజీపీ నియామక వ్యవహారంలో రాష్ట్ర హక్కులను వదలుకునే ప్రసక్తే లేదని మంత్రి రఘుపతి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆరోపణలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇన్‌చార్జ్ డీజీపీ నియామకం వ్యవహారాన్ని తొలుత తెర మీదకు తెచ్చిందే అన్నాడీఎంకే పాలకులు అని విమర్శించారు. తాజాగా తాము డీజీపీ నియామకం సంబంధించి యూపీఎస్సీ మార్గదర్శకాలను అనుసరించినా, ఇందులో కేంద్రం జోక్యం పెరగడంతోనే ఇన్‌చార్జ్ డీజీపీ ద్వారా కాలం నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. తమిళనాడుతో సంబంధం లేకుండా ఇతర రాష్ట్రానికి చెందిన, వారికి కావాల్సిన ఐపీఎస్‌ను తమిళనాడులో నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిని తాము అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. డీజీపీ నియామకంలో హక్కులను వదలుకోమని స్పష్టం చేశారు. సీబీఐ అంటే తమకు భయం లేదని బీఎస్పీ నేత ఆర్మ్ స్ట్రాంగ్ హ్యత కేసు విషయంపై మంత్రి రఘపతి వ్యాఖ్యలు చేశారు. సీబీఐ అంటే భయ పడాల్సింది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఆయనపై గతంలో బయలుదేరి అవినీతి అక్రమాల కేసులో సీబీఐ విచారణకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించ లేదా? అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ న్యాయబద్ధంగా ఉంటుందని భావిస్తే, కోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్పపీడనం


