56వ ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది, ఇందులో విభిన్న రకాల సినిమాల ప్రదర్శనతో, సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రత్యేక అభినందన కార్యక్రమంతో పాటు పలు కొత్త టెక్నాలజీ–ఆధారిత ఈవెంట్‌లు ఉంటాయి.
ముఖ్యాంశాలు
👉 గ్లోబల్ ఫిల్మ్ షోకేస్: ఈ ఉత్సవంలో 81 దేశాల నుండి 240 కి పైగా సినిమాలు ప్రదర్శించబడతాయి, వీటిలో 13 ప్రపంచ ప్రీమియర్‌లు, అనేక అంతర్జాతీయ ఆసియా ప్రీమియర్‌లు ఉన్నాయి.
👉50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ముగింపు వేడుకలో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ను సత్కరిస్తారు, ఇది ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ. ఆయన సినిమా లాల్ సలామ్ ప్రదర్శిస్తారు.
👉 జపాన్ ’కేంద్రీకరణ దేశం’గా , స్పెయిన్ ’భాగస్వామి దేశం’గా ఆస్ట్రేలియా ’స్పాట్‌లైట్ దేశం’గా వ్యవహరిస్తున్నాయి, ఈ దేశాల నుంచి క్యూరేటెడ్ ఫిల్మ్ విభాగాలు ఉంటాయి.
👉ఈ ఉత్సవంలో భారతీయ సినిమా దిగ్గజాలు గురుదత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్ భూపేన్ హజారికా, సలీల్ చౌదరి లతో పాటు మన తెలుగు సినీరంగానికి చెందిన దివంగత అద్భుత నటి పి. భానుమతి శత జయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. ఇదే ఫెస్టివల్‌లో భాగంగా గత ఏడాది స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు జరిగిన విషయం తెలిసిందే.
👉పనోరమా విభాగం భారతీయ సినిమా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది, ఇందులో 25 చలనచిత్రాలు, 20 నాన్–ఫీచర్ చిత్రాలు ఉన్నాయి. ఈ సినీ ఉత్సతవంలో తమిళ చిత్రం అమరన్ ప్రారంభ చలనచిత్రంగా, కాకోరి ప్రారంభ నాన్–ఫీచర్ చిత్రంగా ఉంటాయి.
👉నూతన దర్శకుడి ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ కోసం పోటీలో భారతదేశం విదేశాల నుంచి ఏడుగురు తొలిసారి చిత్ర నిర్మాతలు పాల్గొంటారు, సినిమాలోకి కొత్త వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో‘ (సిఎమ్‌ఒటి) నిర్వహిస్తున్నారు, దీనిలో భాగంగా 124 మంది యువకులు 48 గంటల చిత్రనిర్మాణ సవాలులో పాల్గొంటారు.
👉మాస్టర్ క్లాసెస్ – వర్క్‌షాప్‌లు ప్రధానంగా ఉంటాయి. విధు వినోద్ చోప్రా, ఆమిర్ ఖాన్, అనుపమ్ ఖేర్ , బాబీ డియోల్ వంటి ప్రఖ్యాత సినీ ప్రముఖులు 21 మాస్టర్ క్లాసెస్ , ‘ఇన్–కన్వర్సేషన్‘ సెషన్ లను నిర్వహిస్తారు.
👉 ‘సినిమాఏఐ హ్యాకథాన్ పేరిట తొలిసారిగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సినిమాటిక్ పృజనాత్మకత కలయికను అన్వేషించే హ్యాకథాన్, ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ విభాగంతో పాటు ప్రారంభిస్తారు.
👉‘ఇఫెస్టా‘ పేరుతో సాంస్కృతిక కోలాహలం మరో ఆకర్షణ. ప్రధాన ఉత్సవానికి సమాంతరంగా ’ఇఫెస్టా’ నడుస్తుంది. యువత భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కలిగి ఉన్న ఒక శక్తివంతమైన వినోద జోన్ గా ఇది ఉంటుంది.
👉దక్షిణాసియాలో అతిపెద్ద ఫిల్మ్ మార్కెట్ ఫిల్మ్ బజార్:, వేవ్స్ ఫిల్మ్ బజార్ 19వ ఎడిషన్, ఉత్పత్తి, పంపిణీ అమ్మకాల కోసం 300 కంటే ఎక్కువ ఫిల్మ్ ప్రాజెక్ట్‌లతో సృష్టికర్తలు, పరిశ్రమలు. ప్రేక్షకులను కలుపుతుంది.


