సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వాట్సాప్ గ్రూప్స్ హ్యాకింగ్ కలకలం రేపుతోంది. ఎస్‌బీఐ ఆధార్ అప్‌డేట్ పేరుతో పలువురు తెలంగాణ కేబినెట్ మంత్రులు,హైదరాబాద్ జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపులను సైబర్ నేరస్తులు హ్యాక్ చేసినట్లు సమాచారం.
ఎస్‌బీఐ ఆధార్ అప్‌డేట్ పేరుతో హ్యాకర్లు APK ఫైల్స్‌ను పంపి, వాటిని ఓపెన్ చేసిన వెంటనే ఫోన్‌ను తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. పలువురు మీడియా సంబంధిత గ్రూపులు, మంత్రుల అధికారిక గ్రూపులు, సీఎంవో గ్రూప్, డిప్యూటీ సీఎం గ్రూప్ కూడా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మంత్రుల పీఆర్వోల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అయ్యాయని సందేశాలు వస్తున్నాయి.
వాట్సాప్ గ్రూప్స్ హ్యాక్ అవుతున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలతో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హ్యాకైన వాట్సాప్ గ్రూపులను హ్యాకర్లను సురక్షితంగా ఉంచారు.
వాట్సాప్ గ్రూప్‌ల హ్యాకింగ్‌పై సైబర్ క్రైమ్ నిపుణులు పలు సూచనలు జారీ చేశారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దంటూ జర్నలిస్టుల్ని హెచ్చరిస్తున్నారు. ‘ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దు, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దుంటూ’ అప్రమత్తం చేస్తున్నారు.


