కీసర: మేడ్చల్ జిల్లాలోని కీసరలో దారుణం చోటు చేసుకుంది. పాత బకాయిల వ్యవహారంలో దొడ్ల మిల్క్ డెయిరీ మేనేజర్ శ్రీనివాస్‌పై తల్వార్‌తో దాడి చేశాడు పాల వ్యాపారి కిరణ్. మేనేజర్ శ్రీనివాస్‌పై కిరణ్ అతి కిరాతకంగా దాడి చేశాడు. ఈ ఘటనలో డెయిరీ మేనేజర్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పాల వ్యాపారి భారీగా బకాయిలు పడటంతో ఆ విషయాన్ని మేనేజర్ శ్రీనివాస్ అడిగాడు. దాంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన కిరణ్.. తన వెంట తెచ్చుకున్న తల్వార్‌తో దాడికి దిగాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో శ్రీనివాస్‌కు బలమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని సదరు డైరీ వర్గాలు స్పష్టం చేశాయి.


