గువహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. 247/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోపు ఆట ప్రారంభించిన సఫారీలు.. నాలుగు వందల మార్కును సునాయాసంగా దాటారు. ఈరోజు(ఆదివారం, నవంబర్ 23వతేదీ) బ్యాటింగ్‌లో సెనురన్ ముత్తుసామి సెంచరీ నమోదు చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ముత్తుసామి 206 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 2 సిక్స్‌లు సాయంతో 109 పరుగులు సాధించాడు.

ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన కైల్ వెర్రెయెన్నె మార్కో జాన్సెన్‌లు సైతం ఆకట్టుకున్నారు. వెర్రెయెన్నె 45 పరుగులు సాధించగా, జాన్సెన్ 93 పరుగులు చేశాడు. జాన్సెన్ 91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో చెలరేగి ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో ఏడో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం, ఎనిమిదో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం లభించడంతో సఫారీలు భారీ స్కోరు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు సాధించగా,రవీంద్ర జడేజా, బుమ్రా, సిరాజ్‌లు తలో రెండు వికెట్లు దక్కాయి. చివరి వికెట్‌గా పెవిలియన్ చేరిన జాన్సెన్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. భానత బౌలర్లలో కుల్దీప్ 115 పరుగులు సమర్పించుకోగా, సిరాజ్ 106 పరుగులు ఇచ్చాడు. 25 ఓవర్లు మించి వేసిన బౌలర్లలో బుమ్రా ఒక్కడే కుదురుగా పరుగులు ఇచ్చాడు. బుమ్రా 32 ఓవర్లు వేసి 75 పరుగులు ఇచ్చాడు.
అనంతరం తొలి ఇన్నిం గ్స్ ఆరంభించిన భారత్.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. జైశ్వాల్(7 బ్యాటింగ్), రాహుల్(2 బ్యాటింగ్)క్రీజ్‌లో ఉన్నారు.



