స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వడోదర వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. సిరీస్ ప్రారంభ నేపథ్యంలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం. భారత్-న్యూజిలాండ్ ఇప్పటివరకు 17 ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ 6, భారత్ 9 సిరీస్‌ల్లో విజయాలు సాధించాయి. 2 సిరీస్‌లు డ్రా అయ్యాయి.
వీటిలో భారత్‌లో జరిగిన సిరీస్‌లను ప్రత్యేకంగా తీసుకుంటే.. భారత్ ఇప్పటివరకు స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఏడు వన్డే సిరీస్‌లు అడగా ఒక్కదాంట్లో కూడా ఓడిపోలేదు. ఏడు సిరీస్‌ల్లోనూ జయకేతనం ఎగురవేసి, స్వదేశంలో తిరుగులేని రికార్డు కలిగి ఉంది. చివరి సారిగా (2022-23) స్వదేశంలో జరిగిన సిరీస్‌లో టీమిండియా 3-0తో కివీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
భారత్-న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లు..
న్యూజిలాండ్‌లో జరిగినవి..
1975/76- 2-0 (న్యూజిలాండ్)
1980-81- 2-0 (న్యూజిలాండ్)
1993-94- 2-2 (డ్రా)
1998-99- 2-2 (డ్రా)
2002-03- 5-2 (న్యూజిలాండ్)
2008-09- 3-1 (5) (భారత్)
2013-14- 4-0 (5) (న్యూజిలాండ్)
2018-19- 4-1 (భారత్)
2019-20- 3-0 (న్యూజిలాండ్)
2022-23- 1-0 (3) (న్యూజిలాండ్)
భారత్‌లో జరిగిన సిరీస్‌లు..
1988/89- 4-0
1995-96- 3-2
1999-00- 3-2
2010-11- 5-0
2016-17- 3-2
2017-18- 2-1
2022-23- 3-0
* అన్నింటిలో భారత్‌దే విజయం
హెడ్ టు హెడ్ రికార్డులు
భారత్-న్యూజిలాండ్ ఇప్పటివరకు 120 వన్డేల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో భారత్ 62, న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. 7 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఓ మ్యాచ్ టై అయ్యింది. వీటిలో భారత్ స్వదేశంలో గెలిచిన మ్యాచ్‌లు 31 కాగా.. న్యూజిలాండ్ వారి స్వదేశంలో గెలిచిన మ్యాచ్‌లు 26.
చివరిగా తలపడిన మ్యాచ్‌లోనూ పరాభవమే
భారత్-న్యూజిలాండ్ చివరిగా వన్డే ఫార్మాట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్)
భారత్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు..
డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జాకరీ ఫౌల్క్స్, నిక్ కెల్లీ, జోష్ క్లార్క్సన్, మైఖేల్ రే, కైల్ జేమీసన్, మిచెల్ హే, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెనాక్స్


