యాషెస్ 2025-26 తొలి టెస్టులో విజయం సాధించి జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ హ్యామ్‌స్ట్రింగ్(తొడ కండరాలు) గాయం కారణంగా మిగిలిన యాషెస్ సిరీస్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
రెండు వారాల క్రితం విక్టోరియాతో జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో హాజిల్‌వుడ్‌కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత స్కానింగ్ తరలించగా చిన్న బ్రేక్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా తొలి టెస్టు నుంచి అతడిని తప్పించింది.
అయితే రెండో టెస్టు సమయానికి హాజిల్‌వుడ్ ఫిట్‌నెస్ సాధిస్తాడని ఆసీస్ మేనెజ్‌మెంట్ ఆశలు పెట్టుకుంది. కానీ అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు ప్రముఖ క్రికెట్ రిపోర్టర్ పీటర్ లాలర్ తెలిపాడు.
'7 క్రికెట్'లో పీటర్ లాలర్ మాట్టాడుతూ.. హాజిల్‌వుడ్ గురుంచి కొన్ని వార్తలు నేను విన్నాను. అవే నిజమైనతే ఈ సిరీస్‌లో హాజిల్‌వుడ్‌ను మని చూడకపోవచ్చు అని చెప్పుకొచ్చాడు. కాగా హాజిల్‌వుడ్‌ను గత కొంతకాలంగా గాయాలు వెంటాడుతున్నాయి. గత వేసవి సీజన్‌లో పిక్క సమస్య కారణంగా అతను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అలాగే 2021-22 యాషెస్ సిరీస్‌లో కూడా అతను కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు.
కమ్మిన్స్ అనుమానమే?
మరోవైపు పెర్త్ టెస్టుకు దూరంగా ఉన్న ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడం అనుమానమే. కమిన్స్ వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. తొలి టెస్టులో కమ్మిన్స్, హాజిల్‌వుడ్ లేనిప్పటికి సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతం చేశాడు.
మొత్తంగా పది వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఈ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు గబ్బా వేదికగా డిసెంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది.
చదవండి: IND vs SA: కుల్దీప్.. నీకు ఇది రెండో సారి వార్నింగ్? పంత్ సీరియస్


