గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ తన సహనాన్ని కోల్పోయాడు. రెండో రోజు ఆట సందర్భంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై పంత్ సీరియస్ అయ్యాడు. కుల్దీప్ తన ఓవర్ ప్రారంభించడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పంత్ అసహనం వ్యక్తం చేశాడు.
అయితే పంత్ కోపానికి ఆర్ధం వుంది. ఎందుకంటే ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన క్లాక్ రూల్ ప్రకారం.. ఓ ఓవర్ ముగిసిన 60 సెకన్లలోపల తదుపరి ఓవర్‌ను ఆరంభించాల్సి ఉంటుంది. ఆలస్యమైతే ఫీల్డింగ్ టీంకు రెండు హెచ్చరికలు ఇస్తారు. మూడవసారి ఆలస్యమైతే బ్యాటింగ్ చేసే జట్టు ఐదు పెనాల్టీ పరుగులు కలిపిస్తారు. ఈ హెచ్చరికలు ప్రతి 80 ఓవర్లకు రీసెట్ అవుతాయి.
రెండోసారి వార్నింగ్..
ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో కూడా పంత్‌కు ఇదే విషయంపై అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు రెండో రోజు ఆటలో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 88వ ఓవర్‌ను సమయానికి ప్రారంభించనందును పంత్‌కు అంపైర్ రెండోసారి వార్నింగ్ ఇచ్చాడు. అదే మూడో సారి ఇదే సమస్యపై హెచ్చరిక వస్తే భారత్ ఐదు పరుగులు పెనాల్టీగా సౌతాఫ్రికాకు ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే కుల్దీప్‌పై పంత్ ఫైరయ్యాడు. "30 సెకన్ల టైమర్ ఉంది. ఇంట్లో ఆడుతున్నాను అనుకున్నావా ఏంటి? త్వరగా ఒక బంతి వేయి. కుల్దీప్ ఇది నీకు రెండోసారి హెచ్చరిక"అని పంత్ గట్టిగా చెప్పాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయింది.
కాగా సౌతాఫ్రికా వికెట్లను పడగొట్టేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 112 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. క్రీజులో ముత్తుసామి(64), వెర్రియిన్(43) ఉన్నారు.
What's going to be a good score for #TeamIndia to chase in the 1st innings? 💬#CheteshwarPujara backs the batters to score big in Guwahati! 🏟#INDvSA 2nd Test, Day 2 LIVE NOW 👉 https://t.co/J8u4bmcZud pic.twitter.com/vGjwWPopSm
— Star Sports (@StarSportsIndia) November 23, 2025


