భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఆ్రస్టేలియన్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో తుదిపోరుకు అర్హత సంపాదించాడు. ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న ప్రపంచ 6వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)ను లక్ష్యసేన్ కంగు తినిపించాడు.
శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో అతను 17–21, 24–22, 21–16తో రెండో సీడ్ తైవాన్ ప్రత్యరి్థపై చెమటోడ్చి నెగ్గాడు. 86 నిమిషాల పాటు హోరాహోరీగా ఈ పోరు సాగడం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్‌కు చెందిన యుషి తనకతో భారత ఆటగాడు తలపడతాడు.
మరో సెమీస్‌లో తనక 21–18, 21–15తో లిన్ చున్ యి (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. 24 ఏళ్ల భారత ప్లేయర్ హాంకాంగ్ ఓపెన్‌లోనూ టైటిల్ బరిలో నిలిచినప్పటికీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు టైటిలే సాధించలేకపోయాడు. అన్నీ అనుకూలిస్తే... అదృష్టం కలిసొస్తే సీజన్ ముగిసే ఈ దశలో లక్ష్యసేన్ తొలి టైటిల్‌ను ఇక్కడ గెలుచుకునే అవకాశం ఉంది.


