అంధుల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ రోజు నేపాల్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. నేపాల్‌ను 114 పరుగులకే కట్టడి చేసిన భారత్ జట్టు, ఆపై కేవలం 12 ఓవర్లలో 3 వికెట్లకు 117 పరుగులు చేసి టైటిల్‌ను గెలుచుకుంది.
కొలంబోలో జరిగిన తుదిపోరులో భారత మహిళల అంధుల జట్టు ఆద్యంతం ఆకట్టుకుంది. నేపాల్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసి భారత జట్టు.. అటు తర్వాత ఇంకా ఎనిమిది ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది. భారత వైస్ కెప్టెన్ పూలా సారెన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
ఇదిలా ఉంచితే, సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసి పైనల్‌కు చేరిన భారత జట్టు.. ఫైనల్‌లో కూడా మెరిసింది. ఏమాత్రం తడబాటు లేకుండా ఫైనల్ అడ్డంకిని కూడా అధిగమించి ఔరా అనిపించింది. ఇది భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుకు తొలి టీ20 వరల్డ్‌కప్.
ఈ వరల్డ్‌కప్‌తో(వన్దేలు, టీ20లు) కలిపి భారత అంధుల జట్లు(పురుషులు, మహిళలు) మొత్తం ఆరు టైటిల్స్ సాధించాయి.
వివరాలు
2002 (టీ20, పురుషులు): మొదటి అంధుల టీ20 వరల్డ్‌కప్ విజయం
2012 (టీ20, పురుషులు)
2014 (వన్డే, పురుషులు)
2017 (టీ20, పురుషులు)
2018 (వన్డే, పురుషులు)
2025 (టీ20, మహిళలు)


