వ‌ర‌ల్డ్ నెం1 టెస్టు బ్యాట‌ర్‌గా జో రూట్‌.. దిగ‌జారిన జైశ్వాల్‌, గిల్ ర్యాంక్‌లు | Joe Root Becomes Oldest ICC No. 1 Ranked Test Batter In A Decade, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

ICC Test Rankings: వ‌ర‌ల్డ్ నెం1 టెస్టు బ్యాట‌ర్‌గా జో రూట్‌.. దిగ‌జారిన జైశ్వాల్‌, గిల్ ర్యాంక్‌లు

Jul 16 2025 3:25 PM | Updated on Jul 16 2025 3:38 PM

Joe Root becomes oldest ICC No. 1 Ranked Test batter in a decade

ఐసీసీ టెస్టు బ్యాట‌ర్ల‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయ‌ర్‌ జో రూట్ మ‌ళ్లీ అగ్ర పీఠాన్ని అధిరోహించాడు. వారం రోజులు తిరగక ముందే తన సహచర ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను అధిగ‌మించి రూట్‌ టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. లార్డ్స్ వేదికగా టీమిండియాతో జ‌రిగిన మూడో టెస్టులో సెంచ‌రీతో చెల‌రేగిన రూట్‌.. ఒక స్ధానం మెరుగుప‌రుచుకుని నెం1 టెస్టు బ్యాట‌ర్‌గా నిలిచాడు.

భార‌త్ రెండో టెస్టు అనంత‌రం టాప్ ర్యాంక్‌కు చేరుకున్న హ్యారీ బ్రూక్.. ఇప్పుడు 862 పాయింట్ల‌తో మూడో స్ధానానికి ప‌డిపోయాడు. టాప్‌లో రూట్‌(888) కొన‌సాగుతుండ‌గా.. విలియ‌మ్స‌న్‌(867), బ్రూక్‌, స్టీవ్ స్మిత్‌(816) త‌ర్వాత స్ధానాల్లో కొన‌సాగుతున్నారు. ఇక లార్డ్స్ టెస్టులో విఫ‌ల‌మైన య‌శ‌స్వి జైశ్వాల్‌, శుబ్‌మ‌న్ గిల్ రాంక్‌లు దిగ‌జారాయి. 

జైశ్వాల్‌(801) ఒక్క స్ధానం డ్రాప్ అయ్యి ఐదో స్ధానంలో కొన‌సాగుతుండ‌గా.. శుబ్‌మ‌న్ గిల్ (765)ఏకంగా మూడు స్ధానాలు దిగ‌జారి తొమ్మిదో ర్యాంక్‌కు ప‌డిపోయాడు. అదేవిధంగా రిష‌బ్ పంత్ కూడా ఒక స్ధానం డ్రాప్ అయ్యి ఎనిమిదో ర్యాంక్‌లో కొన‌సాగుతున్నాడు. భార‌త్ నుంచి టాప్‌-10 ర్యాంక్‌లో మొత్తంగా ముగ్గురు ఆట‌గాళ్లు ఉన్నారు.

సెకెండ్‌ ప్లేయర్‌గా
టెస్టు బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో జో రూట్ అగ్ర‌స్దానాన్ని కైవసం చేసుకోవడం ఇది ఎనిమిదోసారి కావ‌డం గ‌మ‌నార్హం. టెస్టుల్లో నెం1 ర్యాంక్‌లో కొన‌సాగుతున్న రెండో అతి పెద్ద వ‌య‌ష్కుడిగా రూట్ నిలిచాడు. 34 ఏళ్ల వ‌య‌స్సులో రూట్ ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ జాబితాలో శ్రీలంక క్రికెట్ దిగ్గ‌జం కుమార్ సంగక్కర టాప్‌లో ఉన్నాడు. సంగ‌క్క‌ర 37 ఏళ్ల వ‌య‌స్సులో టెస్టుల్లో నెం1 బ్యాట‌ర్‌గా నిలిచాడు.

కాగా లార్డ్స్ టెస్టులో 22 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు పోరాడినప్పటికి విజయం మాత్రం టీమిండియాకు వరించలేదు. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది.
చదవండి: జడేజా దూకుడుగా ఆడాల్సింది!.. టీమిండియా దిగ్గజాలకు ఇచ్చిపడేసిన పుజారా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement