
ది హాండ్రడ్ లీగ్-2025లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. గురువారం లండన్ వేదికగా ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓవల్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత వంద బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ట్రెంట్ రాకెట్స్ ఓపెనర్, ఇంగ్లండ్ సీనియర్ జో రూట్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తొలి బంతి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై రూట్ విరుచుకుపడ్డాడు. కేవలం 41 బంతుల్లోనే 11 ఫోర్లు, 1 సిక్సర్‌తో 71 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
హాండ్రడ్ లీగ్‌లో రూట్‌కి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. అతడితో పాటు రెహాన్ ఆహ్మద్(28), లిండే(25) రాణించారు. ఓవల్ బౌలర్లలో టామ్ కుర్రాన్, రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బెహాండ్రాఫ్, సౌటర్ తలా వికెట్ సాధించారు.
కాక్స్, కుర్రాన్ ఫిప్టీలు..
అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఓవల్ ఇన్విన్సిబుల్స్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 89 బంతుల్లో చేధించింది. జోర్డాన్ కాక్స్(32 బంతుల్లో 58 నాటౌట్), సామ్ కుర్రాన్(24 బంతుల్లో 54) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ట్రెంట్ రాకర్స్ బౌలర్లలో రెహాన్ ఆహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. విల్లీ, శాండర్సన్ తలా వికెట్ సాధించారు.
చదవండి: Asia Cup 2025: మెగా టోర్నీకి ముందు సంజూ శాంసన్ కీలక నిర్ణయం!
Finally the day when Joe Root got serious in The Hundred/T20s.
He's great technique even good for T20s, unlike Smith & Williamson
But unlucky to couldn't convert numbers in T20s#TheHundred pic.twitter.com/lF8IPvoNqK— Clink (@clinkwrites) August 21, 2025