
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే (ODI Series), టీ20 సిరీస్‌లలో పాల్గొనే ఇంగ్లండ్ జట్లను ప్రకటించారు. హ్యారీ బ్రూక్ Harry Brook) సారథ్యంలో తొలిసారి ఇంగ్లండ్ జట్టు ఈ సిరీస్‌లో పోటీ పడనుంది. తొలి మూడు వన్డేలు వరుసగా మే 29న, జూన్ 1న, జూన్ 3న ఎడ్జ్‌బాస్టన్, కార్డిఫ్, ఓవల్‌లలో జరుగుతాయి.
అనంతరం జూన్ 6న, జూన్ 8న, జూన్ 10న వరుసగా మూడు టీ20ల (Eng vs WI T20s)ను చెస్టర్ లీ స్ట్రీట్, బ్రిస్టల్, సౌతాంప్టన్‌లలో నిర్వహిస్తారు. హాంప్‌షైర్ కౌంటీ జట్టుకు ఆడుతున్న ఆల్‌రౌండర్ లియామ్ డాసన్ మూడేళ్ల తర్వాత మళ్లీ జాతీయ టి20 జట్టులోకి వచ్చాడు.
నాటింగ్‌హమ్‌షైర్ ఎడంచేతి వాటం పేస్ బౌలర్ ల్యూక్ వుడ్ రెండేళ్ల తర్వాత టి20 జట్టులోకి ఎంపికయ్యాడు. స్పిన్నర్ టామ్ హార్ట్‌లే రెండేళ్ల తర్వాత వన్టే జట్టులోకి పునరాగమనం చేశాడు. ఫామ్‌లేమితో సతమతమవుతున్న లియామ్ లివింగ్‌స్టోన్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు.
ఇంగ్లండ్ వన్డే జట్టు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, విల్ జాక్స్, జో రూట్, బెన్ డకెట్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్‌సన్, టామ్ బాంటన్, జేకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, టామ్ హార్ట్‌లే, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్, జేమీ స్మిత్.
ఇంగ్లండ్ టీ20 జట్టు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేకబ్ బెథెల్, టామ్ బాంటన్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఒవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల ప్రకటన
మెల్‌బోర్న్/జొహన్నెస్‌బర్గ్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ఆస్ట్రేలియా జట్టు... తొలిసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌గా అవతరించేందుకు దక్షిణాఫ్రికా జట్టు సమాయత్తమవుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జూన్ 11 నుంచి 14 వరకు లండన్‌లోని లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ మెగా పోరులో పాల్గొనే రెండు జట్లను మంగళవారం ప్రకటించారు.
ఆస్ట్రేలియా జట్టు:
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, హాజల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఇన్‌గ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, సామ్ కొన్‌స్టాస్, కునెమన్, లబుషేన్, నాథన్ లయన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, వెబ్‌స్టర్. బ్రెండన్ డగెట్ (ట్రావెలింగ్ రిజర్వ్).
దక్షిణాఫ్రికా జట్టు:
తెంబా బవుమా (కెప్టెన్), బెడింగ్‌హమ్, కార్బిన్ బోష్, టోనీ డి జార్జి, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, మార్క్‌రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుస్వామి, లుంగి ఎన్‌గిడి, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడ, రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరీన్.