
Update: టీమిండియా-ఇంగ్లండ్ మధ్య నాలుగవ టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 544 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 77, లియాం డాసన్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కంటే ఇంగ్లండ్ ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది.
రూట్ రికార్డు శతకం: మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం సాధించింది. 127 ఓవర్ల తర్వాత ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 523 పరుగులు చేసి, 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్ రికార్డు శతకం (150) సాధించి ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. అతనికి స్టోక్స్ (66 రిటైర్డ్ హర్ట్) అండగా నిలిచాడు. క్రిస్ వోక్స్ (2), లియామ్ డాసన్ (7) క్రీజ్‌లో ఉన్నారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలే (84), బెన్ డకెట్ (94), ఓలీ పోప్ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. 2, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.