
భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతోంది. 374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ నాలుగో రోజు టీ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉంది.
హ్యారీ బ్రూక్ (98 బంతుల్లో 111; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాది ఇంగ్లండ్ గెలుపుకు గట్టి పునాది వేయగా.. రూట్ (98 నాటౌట్) సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. రూట్‌కు జతగా జేకబ్ బేతెల్ (1) క్రీజ్‌లో ఉన్నాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111) ఔటయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్‌దీప్ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 5 వికెట్లు (గాయం కారణంగా వోక్స్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు) తీయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యంగా కనిపిస్తుంది. ఏదైన అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ల భారత్ గెలవలేదు. ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్ సిరీస్‌ను కూడా కోల్పోతుంది (1-3లో).
అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.
దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.