ఇంగ్లాండ్‌లో... చైనా ఫోన్‌ ట్యాపింగ్ కలకలం | China phone tapping scandal causes uproar in England | Sakshi
Sakshi News home page

ఇంగ్లాండ్‌లో... చైనా ఫోన్‌ ట్యాపింగ్ కలకలం

Jan 29 2026 1:14 AM | Updated on Jan 29 2026 1:18 AM

China phone tapping scandal causes uproar in England

చైనా కంట్రీపై ఇంగ్లాండ్‌లో పలు నివేదికలు సంచలన అంశాలను ప్రచురించాయి. ఆ దేశ మాజీ ప్రధానుల ఉన్నతాధికారుల ఫోన్‌లను చైనా హ్యాక్ చేసినట్లు పలు నివేదికలు తెలిపాయి. అంతేకాకుండా ఈ ట్యాపింగ్‌ కోసం ప్రత్యేకమైన కోడ్‌ లాంగ్వేజ్‌ను వాడినట్లు పేర్కొన్నాయి.

ఇంగ్లాండ్‌లోని పలు సంస్థల నివేదికలు ఇప్పుడు ఆ దేశంలో ‍ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంగ్లాండ్ మాజీ ప్రధానులుగా బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషిసునాక్‌లు ఉన్న సమయంలో వారి ప్రత్యేక అధికారులు వివరాలపై చైనా హ్యాకర్లు ట్యాప్ చేసినట్లు పలు నివేదికలు తెలుపున్నాయి. సాల్ట్‌టైఫూన్ పేరుతో జరిగిన ఈ ఆపరేషన్ 2021-2024 మధ్య జరిగిందని పేర్కొన్నాయి. అందులోనూ రిషి సునాక్ ఆ దేశ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ హ్యాకి్ంగ్ ఎక్కువ  జరిగిందని  నివేదికలు తెలిపాయి.

అయితే ఇటీవల చైనా లండన్‌తో పాటు యూరప్‌లో తన రాయబార కార్యాలయం నిర్మించాలని ప్రతిపాదనలు తీసుకరాగా బ్రిటన్ దానికి అంగీకారం తెలిపింది. ఈ క్రమంలోనే ఆ దేశంలో తన దౌత్య కార్యాలయాన్ని చైనా గూడ చర్య కార్యక్రమాలకు వినియోగించుకునే అవకాశం ఉందని నిరసనలు చెలరేగాయి. దీంతో ఈ నిర్ణయంపై ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ తన నిర్ణయాన్ని పదేపదే వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో చైనా తన నిరసన తెలిపింది. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం ఆమెదం తెలిపింది. అయితే తాజాగా ఫోన్ ఈ నివేదిక మరోసారి ఈ అంశంపై అనుమానాలను రేకెత్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement