
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా ఇవాల్టి (జులై 10) నుంచి మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ పలు భారీ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపని రూట్.. మూడో టెస్ట్‌లో చెలరేగవచ్చు. రూట్ గత రెండు టెస్ట్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 36.33 సగటున కేవలం 109 పరుగులు మాత్రమే చేశాడు.
నేటి నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్‌లో రూట్ బద్దలు కొట్టే ఆస్కారం ఉన్న రికార్డులు ఇవే..!
టెస్ట్‌ల్లో భారత్‌పై 3000 పరుగులు
లార్డ్స్ టెస్ట్‌లో రూట్ 45 పరుగులు చేస్తే భారత్‌పై టెస్ట్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఇదే జరిగితే రూట్ ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్ పరుగులు
ఈ మ్యాచ్‌లో రూట్ 99 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్ పరుగులు పూర్తి చేసుకుంటాడు. అతి తక్కువ మంది ఈ ఫీట్‌ను సాధించారు.
టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున 800 ఫోర్లు
ఈ మ్యాచ్‌లో రూట్ మరో ఫోర్ కొడితే టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున 800 ఫోర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. ఈ ఫీట్‌ను అలిస్టర్ కుక్ (816) ఒక్కడే సాధించాడు.
భారత్‌పై 50 క్యాచ్‌లు
ఈ మ్యాచ్‌లో రూట్ మూడు క్యాచ్‌లు పడితే భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 50 క్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేసే రూట్ టెస్ట్‌ల్లో కొన్ని సందర్భాల్లో ఇంగ్లండ్‌ను క్యాచ్‌లతోనే గెలిపించాడు.
భారత్‌పై 4000 పరుగులు
ఈ మ్యాచ్‌లో రూట్ 33 పరుగులు చేస్తే భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 4000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఫీట్‌ను చాలా తక్కువ మంది సాధించారు.
ఇంగ్లండ్‌లో 11000 పరుగులు
ఈ మ్యాచ్‌లో రూట్ 189 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌లో అన్ని ఫార్మాట్లలో 11000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ రికార్డును కూడా చాలా తక్కువ మంది సాధించారు.
కాగా, ఈ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ విజయం సాధించింది. మూడో మ్యాచ్ ఇవాళ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది.