భారత్‌తో నాలుగో టెస్ట్‌.. రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్న జో రూట్‌ | ENG VS IND 4th Test: Joe Root Surpasses Ricky Ponting And Jacques Kallis In Elite List | Sakshi
Sakshi News home page

భారత్‌తో నాలుగో టెస్ట్‌.. రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్న జో రూట్‌

Jul 25 2025 5:40 PM | Updated on Jul 25 2025 5:59 PM

ENG VS IND 4th Test: Joe Root Surpasses Ricky Ponting And Jacques Kallis In Elite List

మాంచెస్టర్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తొలుత టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్‌ ద్రవిడ్‌ (13288), జాక్‌ కల్లిస్‌ను (13289) అధిగమించి మూడో స్థానానికి ఎగబాకిన రూట్‌.. హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాక టెస్ట్‌ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్‌, జాక్‌ కల్లిస్‌ను దాటేసి రెండో స్థానానికి చేరాడు.

టెస్ట్‌ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేసిన టాప్‌-5 ఆటగాళ్లు..
సచిన్‌ టెండూల్కర్‌- 119
జో రూట్‌- 104
రికీ పాంటింగ్‌- 103
జాక్‌ కల్లిస్‌- 103
రాహుల్‌ ద్రవిడ్‌- 99

టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-5 బ్యాటర్లు..
సచిన్‌ టెండూల్కర్‌- 15921
రికీ పాంటింగ్‌- 13378
జో రూట్‌- 13319*
జాక్‌ కల్లిస్‌- 13289
రాహుల్‌ ద్రవిడ్‌- 13288

మ్యాచ్‌ విషయానికొస్తే.. 225/2 స్కోర్‌ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ తొలి సెషన్‌లో ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా మరో 107 పరుగులు జోడించింది. లంచ్‌ విరామం సమయానికి ఆ జట్టు స్కోర్‌ 332/2గా ఉంది. పోప్‌ 70, రూట్‌ 63 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంగ్లండ్‌ ఇంకా 26 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. పోప్‌, రూట్‌కు ముందు ఓపెనర్లు జాక్‌ క్రాలే (84), బెన్‌ డకెట్‌ (94) కూడా అర్ద సెంచరీలు సాధించారు. క్రాలే వికెట్‌ జడేజాకు.. డకెట్‌ వికెట్‌ అన్షుల్‌ కంబోజ్‌కు దక్కింది.

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్‌ 58, కేఎల్‌ రాహుల్‌ 46, సాయి సుదర్శన్‌ 61, శుభ్‌మన్‌ గిల్‌ 12, రిషబ్‌ పంత్‌ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్‌ ఠాకూర్‌ 41, వాషింగ్టన్‌ సుందర్‌ 27, అన్షుల్‌ కంబోజ్‌ 0, జస్ప్రీత్‌ బుమ్రా 5, మహ్మద్‌ సిరాజ్‌ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

ఇంగ్లండ్‌ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్‌ 3 వికెట్లు తీశాడు. వోక్స్‌, డాసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement