
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో మ్యాచ్‌లు పరంగా అత్యంతవేగంగా 13000 పరుగుల మైలు రాయిని అందుకున్న బ్యాటర్‌గా రూట్ చరిత్ర సృష్టించాడు. నాటింగ్‌హామ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో టెస్టులో 28 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద రూట్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ రేర్ ఫీట్‌ను రూట్ కేవలం 153 మ్యాచ్‌లలో నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ పేరిట ఉండేది. కల్లిస్ 159 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును సాధించాడు. తాజా మ్యాచ్‌తో కల్లిస్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. కల్లిస్‌తో పాటు దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్(160), రికీ పాంటింగ్(162), సచిన్ టెండూల్కర్(163)ను అధిగమించాడు.
అయితే మ్యాచ్‌ల పరంగా మాత్రం ఈ ఫీట్ సాధించిన జాబితాలో సచిన్(266) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రూట్(279 మ్యాచ్‌లు) ఐదో స్ధానంలో ఉన్నారు. ఇక టెస్టుల్లో 13,000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ఇంగ్లీష్ క్రికెటర్ కూడా జో రూట్‌నే కావడం గమనార్హం.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. క్రీజులో పోప్(169), బ్రూక్(9) ఉన్నారు. అంతకుముందు డకెట్(140), క్రాలీ(124) సెంచరీలు సాధించారు