
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్బుతమైన సెంచరీతో సాధించాడు. తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటలో తొలి బంతికే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
రూట్‌కు ఇది 36వ టెస్టు సెంచరీ కావడం విశేషం. తొలి రోజు ఆట మొదటి సెషన్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చిన జో రూట్.. తన అద్బుత ప్రదర్శనతో స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. క్రీజోలో పాతుకుపోయిన ఈ ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఓలీ పోప్, బెన్ స్టోక్స్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలను రూట్ నెలకొల్పాడు. రూట్ ఓవరాల్‌గా 104 పరుగులు చేసి ఔటయ్యాడు.
ద్రవిడ్ రికార్డు బ్రేక్..
ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రూట్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్‌గా రూట్(36) రికార్డులెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, స్టీవ్ స్మిత్ పేరిట సంయుక్తంగా ఉండేది.
వీరిద్దరూ 35 టెస్టు సెంచరీలు సాధించారు. తాజా మ్యాచ్‌తో వీరిద్దరిని రూట్ అధిగమించాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో ఉన్నాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రూట్‌నే టాప్‌లో ఉన్నాడు.
అదేవిధంగా టెస్టుల్లో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా స్మిత్ రికార్డును సమం చేశాడు. స్మిత్ ఇప్పటివరకు 11 సెంచరీలు చేయగా.. రూట్ కూడా సరిగ్గా 11 టెస్టు సెంచరీలు చేశాడు.
బుమ్ బుమ్ బుమ్రా..
రెండో రోజులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్(44), జో రూట్(104) అద్బుతమైన బంతులతో పెవిలియన్‌కు పంపాడు. 87 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.
భారత్‌పై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్లేయర్లు
జో రూట్ (ఇంగ్లండ్)- 11
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 11
గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)- 8
వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- 8
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 8
అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్లేయర్లు..
సచిన్ టెండూల్కర్ (భారత్) 51
జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) 45
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 41
కుమార్ సంగక్కర (శ్రీలంక) 38
జో రూట్ (ఇంగ్లాండ్) 37
చదవండి: కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. లారా రియాక్షన్ ఇదే