ఇంగ్లండ్‌- భారత్‌ టెస్టు సిరీస్‌.. డేంజ‌ర్‌లో స‌చిన్‌, కోహ్లి రికార్డులు | Joe Root Eyes Iconic Sachin, Kohli Feats In IND Vs ENG Tests | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్‌- భారత్‌ టెస్టు సిరీస్‌.. డేంజ‌ర్‌లో స‌చిన్‌, కోహ్లి రికార్డులు

Jun 19 2025 9:14 PM | Updated on Jun 19 2025 9:27 PM

Joe Root Eyes Iconic Sachin, Kohli Feats In IND Vs ENG Tests

భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రంగం సిద్ద‌మైంది. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా జ‌ర‌గ‌నున్న ఈ సిరీస్‌.. శుక్ర‌వారం(జూన్ 20) నుంచి లీడ్స్ వేదిక‌గా ప్రారంభం కానుంది. తొలి టెస్టులో అమీతుమీ తెల్చుకోవ‌డానికి భార‌త్‌-ఇంగ్లండ్ జ‌ట్లు సిద్ద‌మ‌య్యాయి.

అయితే ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ స్టార్ బ్యాట‌ర్ జో రూట్‌ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ ఇంగ్లండ్ గ్రేట్ బ్యాట‌ర్‌.. భార‌త క్రికెట్ దిగ్గ‌జాలు స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డుల‌పై క‌న్నేశాడు.

మ‌రో మూడు హాఫ్ సెంచ‌రీలు చేస్తే..
భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రిగిన టెస్టు మ్యాచ్‌ల‌లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు సాధించిన రికార్డు లెజెండ‌రీ బ్యాట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ పేరిట ఉంది. గ‌వాస్క‌ర్ త‌న కెరీర్‌లో ఇంగ్లండ్‌పై 16 టెస్టు ఫిప్టీలు చేశారు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్ 13 హాఫ్ సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు.

ఆ త‌ర్వాత స్ధానంలో జూరూట్‌(11 హాఫ్ సెంచ‌రీలు) ఉన్నాడు. ఈ క్ర‌మంలో రూట్ మ‌రో మూడు హాఫ్ సెంచరీలు చేస్తే.. స‌చిన్ అధిగ‌మిస్తాడు. అదేవిధంగా  ఆరు హాఫ్ సెంచ‌రీలు చేస్తే సునీల్ గ‌వాస్క‌ర్ ఆల్‌టైమ్ రికార్డును కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.

చ‌రిత్ర‌కు అడుగు దూరంలో..
భార‌త్-ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రిగిన అంత‌ర్జాతీయ మ్యాచ్‌లలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు ఇంగ్లండ్‌పై మూడు ఫార్మాట్ల‌లో  4036 పరుగులు చేశాడు. ఆ త‌ర్వాత 
స్ధానంలో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్‌(3990) ఉన్నాడు. ఈ లిస్ట్‌లో మూడో స్ధానంలో జో రూట్‌(3858) ఉన్నాడు. ఇప్పుడు రూట్ 133 ప‌రుగులు చేస్తే స‌చిన్‌ను, 179 ప‌రుగులు సాధిస్తే విరాట్‌ను అధిగ‌మించి అగ్ర‌స్ధానానికి చేరుకుంటాడు.

కాగా భార‌త్‌పై జో రూట్‌కు అద్భుత‌మైన రికార్డు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు రూట్ టీమిండియాపై రూట్ 28 సార్లు (13 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు) ఏభైకి పైగా ప‌రుగులు చేశాడు. రూట్ మరో ఐదు అర్ధ శతకాలు చేస్తే సచిన్, కోహ్లి(32)ను దాటేస్తాడు.
చదవండి: Mohammed Siraj: బిజినెస్ రంగంలోకి సిరాజ్‌.. బంజారా హిల్స్‌లో లగ్జరీ రెస్టారెంట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement