Photo Credit: Hundred Twitter
హండ్రెడ్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సదరన్ బ్రేవ్.. వరుస విజయాలతో పట్టికలో తొలి స్థానంలో ఉన్న ట్రెంట్ రాకెట్స్‌ను ఊహించని దెబ్బ కొట్టింది. ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
మిచెల్ సాంట్నర్ (35 నాటౌట్), లూయిస్ జార్జరీ (28 నాటౌట్) ఆఖర్లో మెరవడంతో ట్రెంట్ రాకెట్స్ మంచి స్కోరును సాధించింది. అంతకముందు ఫిన్ అలెన్ (23) పర్వాలేదనిపించాడు. సదరన్ బ్రేవ్ బౌలర్లలో నిఖిల్ చౌదరీ, డానియెల్ వోర్రల్, స్టోయినిస్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం సదరన్ బ్రేవ్ 97 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ట్రిస్టన్ స్టబ్స్ (28 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, మార్కస్ స్టోయినిస్ (25 బంతుల్లో 46) మెరిశాడు. ఓపెనర్ జేమి స్మిత్ (26) పరుగులు చేశాడు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో క్లావిన్ హారిసన్ 2 వికెట్లు తీయగా, బెన్ సాండర్సన్, క్రెయిగ్ ఓవర్టన్ చెరొక వికెట్ పడగొట్టారు.
Tristan Stubbs reaches his 50 with a six!
It's game on 👊#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/yfoaFvNGMK— The Hundred (@thehundred) August 8, 2026
Read: లంకతో తొలి టెస్టుకు భారత జట్టు.. తెరపైకి ఊహించని పేరు!


