రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్‌.. టాప్‌ ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్న రూట్‌ | Brook Goes Past Kohli, Joe Root Achieves Career Best Rating In Updated ICC Rankings | Sakshi
Sakshi News home page

రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్‌.. టాప్‌ ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్న రూట్‌

Oct 16 2024 4:43 PM | Updated on Oct 16 2024 4:52 PM

Brook Goes Past Kohli, Joe Root Achieves Career Best Rating In Updated ICC Rankings

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్ల హవా కొనసాగింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాళ్లు జో రూట్‌, హ్యారీ బ్రూక్‌ తాజా ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇటీవల పాకిస్తాన్‌తో ముగిసిన తొలి టెస్ట్‌లో హ్యారీ బ్రూక్‌ ట్రిపుల్‌ సెంచరీ, జో రూట్‌ డబుల్‌ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనలతో రూట్‌ కెరీర్‌ అత్యుత్తమ రేటింగ్‌ పాయింట్లు (932) సాధించి టాప్‌ ర్యాంక్‌ను సుస్థిరం చేసుకున్నాడు. 

బ్రూక్‌ ఏకంగా 11 స్థానాలు ఎగబాకి కేన్‌ విలియమ్సన్‌తో సహా రెండో స్థానాన్ని ఆక్రమించాడు. రూట్‌, బ్రూక్‌ దెబ్బకు భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి చెరో స్థానం కోల్పోయి నాలుగు, ఏడు స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీలు చేసిన పాక్‌ ఆటగాళ్లు అఘా సల్మాన్‌, షాన్‌ మసూద్‌ 11, 12 స్థానాలు మెరుగపర్చుకుని 22, 51వ స్థానాలకు ఎగబాకారు.

టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్‌-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. బుమ్రా, అశ్విన్‌ టాప్‌-2లో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా ఆరు, కుల్దీప్‌ 16 స్థానాల్లో ఉన్నారు. పాక్‌తో టెస్ట్‌ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన జాక్‌ లీచ్‌ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 28వ స్థానానికి ఎగబాకాడు. టెస్ట్‌ ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా, అశ్విన్‌ టాప్‌-2లో కొనసాగుతుండగా.. జో రూట్‌ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరాడు.   

చదవండి: ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు
 

Advertisement
 
Advertisement
Advertisement