స్పెయిన్‌ నంబర్‌వన్‌.. ర్యాంకింగ్స్‌లో మొరాకో, నార్వే సంచ‌ల‌నం | Champions-Spain Retains Top Spot-FIFA rankings-Morocco Creates History | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌ నంబర్‌వన్‌.. ర్యాంకింగ్స్‌లో మొరాకో, నార్వే సంచ‌ల‌నం

Jul 21 2026 8:08 AM | Updated on Jul 21 2026 1:17 PM

Champions-Spain Retains Top Spot-FIFA rankings-Morocco Creates History

Photo Credit: FIFA Twitter

ఫిఫా ప్ర‌పంచక‌ప్ 2026 టైటిల్ గెలుచుకున్న స్పెయిన్ జ‌ట్టు మ‌రోసారి నంబ‌ర్‌వ‌న్ ర్యాంకును అందుకుంది. ఫైన‌ల్‌ మ్యాచ్‌  త‌ర్వాత ఫిఫా అధికారికంగా ర్యాంకుల‌ను విడుద‌ల చేసింది. చాంపియ‌న్‌గా నిలిచిన స్పెయిన్ నంబ‌ర్‌వ‌న్ స్థానానికి చేరుకోగా, ర‌న్న‌రప్‌గా నిలిచిన అర్జెంటీనా రెండో స్థానానికి ప‌డిపోయింది. 


Photo Credit: FIFA Twitter

ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు లేన‌ప్ప‌టికీ, ఈసారి ఫిఫాలో క్వార్ట‌ర్ ఫైన‌ల్ వ‌ర‌కు చేరుకున్న మొరాకో, నార్వే జట్లు మాత్రం సంచ‌ల‌నం సృష్టించాయి. ఫిఫా చ‌రిత్ర‌లోనే మొరాకో తొలిసారి టాప్‌-10లో చోటు ద‌క్కించుకుంది. క్వార్ట‌ర్స్‌లో ఓడిన మొరాకో ఆరో స్థానంలో నిలిచింది. ఎర్లింగ్‌ హాలండ్‌ సారథ్యంలోని నార్వే కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. ఈ ఫిఫాలో క్వార్టర్స్‌ చేరుకొని చరిత్ర సృష్టించిన నార్వే 12 స్థానాలు ఎగబాకి 19వ స్థానం (టాప్‌-20)లో నిలిచింది.


Photo Credit: FIFA Twitter

ఇక కాంస్యం గెలిచిన ఇంగ్లండ్ మూడో స్థానంలో, ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ప్రిక్వార్ట‌ర్స్‌లోనే ఇంటిబాట ప‌ట్టిన పోర్చుగ‌ల్ రెండు స్థానాలు దిగ‌జారి ఏడో స్థానానికి ప‌డిపోగా, అదే స‌మ‌యంలో బ్రెజిల్ ఐదో స్థానానికి చేరుకుంది. 

ఇక బెల్జింయం, నెద‌ర్లాండ్స్, మెక్సికో వ‌రుస‌గా ఎనిమిది, తొమ్మిది, ప‌ది స్థానాలు ద‌క్కించుకున్నాయి. ఫిఫా 2026లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన‌ మాజీ చాంపియ‌న్ జ‌ర్మ‌నీ మాత్రం టాప్-10లో చోటు కోల్పోయి 12వ స్థానంలో నిలవ‌గా, క్రొయేషియా 13వ స్థానంలో ఉంది. ఇక ఈసారి ఫిఫాలో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న అనామ‌క జ‌ట్టు కేప్‌వెర్డె 8 స్థానాలు ఎగ‌బాకి 64వ స్థానంలో నిలిచింది. ఈ ఫిఫాలో కేప్‌వెర్డె ప్రిక్వార్ట‌ర్స్ వ‌ర‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

చదవండి: అర్జెంటీనా ఓట‌మి.. మెస్సీ భావోద్వేగ లేఖ‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement