
అక్టోబర్ 2 నుంచి భారత్‌తో ప్రారంభంకాబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు (India vs West Indies) ముందు వెస్టిండీస్ జట్టుకు (West Indies) మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే యువ స్పీడ్ గన్ షమార్ జోసఫ్ (Shamar Joseph) (గాయం) సేవలను కోల్పోయిన విండీస్.. తాజాగా వారి ప్రధాన పేసర్ అల్జరీ జోసఫ్‌ను (Alzarri Joseph) కూడా మిస్ అయ్యింది.
అల్జరీ వెన్నెముక సమస్య కారణంగా భారత్‌తో సిరీస్‌కు దూరమైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అల్జరీ స్థానాన్ని జెడియా బ్లేడ్స్‌తో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. తొలుత అల్జరీ స్థానంలో జేసన్ హోల్డర్‌తో భర్తీ చేయాలని విండీస్ బోర్డు భావించినప్పటికీ.. అతను నో చెప్పినట్లు తెలుస్తుంది.
హోల్డర్ ముందుగానే ఓ మెడికల్ ప్రొసీజర్‌ను ప్లాన్ చేసుకున్నందున భారతతో సిరీస్ ఆడలేనని చెప్పినట్లు సమాచారం.అంతకుముందు షమార్ జోసఫ్ స్థానాన్ని విండీస్ బోర్డు 22 ఏళ్ల బార్బడోస్ ఆల్‌రౌండర్ జోహాన్ లేన్‌తో (Johann Layne) భర్తీ చేసింది.
కాగా, ఆసియా కప్ తర్వాత కేవలం 3 రోజుల గ్యాప్‌లోనే భారత్, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ జరుగనుంది. అనంతరం అక్టోబర్ 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో రెండో టెస్ట్ జరుగుతుంది.
ఈ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. జియో హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్‌కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్
వెస్టిండీస్: రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, తేజ్‌నరైన్ చంద్రపాల్, జాన్ క్యాంప్‌బెల్, జోహన్ లేన్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, జెడియా బ్లేడ్స్, జేడన్ సీల్స్, ఖారీ పియెర్
చదవండి: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్