వెస్టిండీస్ సంచలన బ్యాటర్ షాయ్ హోప్ (Shai Hope) వన్డే క్రికెట్‌లో రికార్డుల మీద రికార్డును నమోదు చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 19) జరిగిన వన్డేలో సుడిగాలి శతకం బాదిన అతడు.. వేర్వేరు విభాగాల్లో పలు రికార్డులు సాధించాడు.
ఈ మ్యాచ్‌లో మహోగ్రరూపం దాల్చిన హోప్ కేవలం 69 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో హోప్ ఖాతాలో ఈ కింది రికార్డులు చేరాయి.
ఈ ఏడాది విండీస్ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు.
ఈ సెంచరీ హోప్‌కు వన్డేల్లో 19వది. తద్వారా క్రిస్ గేల్ (25) తర్వాత అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా (19) రికార్డు సమం.
19 శతకాలను హోప్ కేవలం 142 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. తద్వారా బాబర్ ఆజమ్ (102), హాషిమ్ ఆమ్లా (104), విరాట్ కోహ్లి (124), డేవిడ్ వార్నర్ (139) తర్వాత అత్యంత వేగంగా ఈ శతకాల మైలురాయిని తాకిన ఆటగాడిగా రికార్డు.
ఈ 19 శతకాలను హోప్ 12 వేర్వేరు దేశాలపై సాధించాడు. భారత్, బంగ్లాదేశ్‌పై అత్యధికంగా తలో 3 సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్‌పై హోప్‌కు ఇదే తొలి వన్డే సెంచరీ.
ఈ సెంచరీతో హోప్ ఈ దశాబ్దంలో (2015-2025) అత్యధిక సెంచరీలు చేసిన తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. తద్వారా బాబర్ ఆజమ్ (9), డికాక్ (8), కోహ్లి (8), గుర్బాజ్ (8), గిల్‌ను (8) మరింత వెనక్కు నెట్టాడు.
ఈ ఇన్నింగ్స్‌తో హోప్ వన్డేల్లో 6000 పరుగుల మైలురాయిని తాకాడు. ఈ మార్కును తాకేందుకు అతనికి 142 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. తద్వారా గ్రేట్ వివ్ రిచర్డ్స్ (141) తర్వాత అత్యంత వేగంగా 6000 పరుగుల మార్కును తాకిన విండీస్ ఆటగాడిగా రికార్డు.
హోప్ ఒక్క ఇన్నింగ్స్‌తో ఇన్ని రికార్డులు సాధించినా ఈ మ్యాచ్‌లో విండీస్ పరాజయంపాలవడం విచారకరం. ఈ పరాజయంతో విండీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. నేపియర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.


