క్రికెట్ చరిత్రలో మనకు తెలీని చాలా విషయాలు దాగి ఉన్నాయి. అందులో ఒకదాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. అది 1997. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన కుడి చేతి వాటం మీడియం పేసర్ ఆంధొని స్టువర్ట్ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన రోజు.
ఈ బౌలర్ అంతర్జాతీయ కెరీర్ నిడివి కేవలం 12 రోజులు మాత్రమే. అయితేనేం, చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆంధొని తన స్వల్ప కెరీర్‌లో ఆడిన 3 వన్డేల్లోనే చారిత్రక ప్రదర్శనలు చేశాడు. అందులో ఒకటి తన మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ నమోదు చేయడం.
మెల్‌బోర్న్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆంథొని హ్యాట్రిక్ (ఇజాజ్ అహ్మద్, మొహమ్మద్ వసీమ్, మొయిన్ ఖాన్) సహా 5 వికెట్ల ప్రదర్శన (5/26) నమోదు చేయడంతో పాటు రెండు క్యాచ్‌లు (ఇంజమామ్-ఉల్-హక్, షాహిద్ ఆఫ్రిది) కూడా పట్టుకొని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తద్వారా నాటికి ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ చరిత్రలో రెండో హ్యాట్రిక్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
Happy Birthday Anthony Stuart
Took an ODI hat-trick in his third ODI only but got injured and then never picked again to play for Australia.
pic.twitter.com/TO3lDa9Spx— Cricketopia (@CricketopiaCom) January 2, 2026
ఇక్కడ విశేషమేమింటంటే.. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న మ్యాచే ఆంథొనికి కెరీర్‌లో చివరిది. సంచలన ప్రదర్శన నమోదు చేసిన తర్వాత అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. తొలుత గాయం, ఆతర్వాత పేలవ ఫామ్ కారణంగా ఒక్క అవకాశం కూడా రాలేదు.
ఏడాది కాలంలోనే జాతీయ జట్టు సహా దేశవాలీ జట్టు నుంచి కూడా కనుమరుగైపోయాడు. అవకాశాల కోసం ఎదురుచూసీ, చూసీ చివరికి 2000 సంవత్సరంలో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటగాడిగా కెరీర్ ముగిసాక ఆంధొని న్యూజిలాండ్‌లో కోచింగ్ కెరీర్‌ను ప్రారంభించాడు.
ఆతర్వాత స్వదేశంలోనూ కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం 56వ పడిలో ఉన్న ఆంథొని తన దేశవాలీ జట్టు న్యూ సౌత్‌వేల్స్‌కే కోచింగ్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. 12 రోజుల్లోనే అంతర్జాతీయ కెరీర్ ముగిసినా, హ్యాట్రిక్ కారణంగా ఆంథొని చరిత్రలో నిలిచిపోయాడు.
సంచలన ప్రదర్శన తర్వాత అతనికి మరో అవకాశం రాకపోవడం మరో విశేషం. చరిత్రలో ఇలాంటి ఎన్నో విశేషాలు ప్రస్తుత తరం క్రికెట్ అభిమానులకు తెలీవు.


