
మేజర్ లీగ్ క్రికెట్లో వెస్టిండీస్ వికెట్‌కీపర్ బ్యాటర్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రీ ఫ్లెచర్ విశ్వరూపం ప్రదర్శించాడు. శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో ఇవాళ (జులై 7) జరిగిన మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లోనే సుడిగాలి శతకం బాదాడు.
వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. ఆండ్రీ ఫ్లెచర్ (58 బంతుల్లో 118; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) సునామీ శతకంతో చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో ఫ్లెచర్‌తో పాటు అలెక్స్ హేల్స్ (26 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (28 బంతుల్లో 29; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా విధ్వంసం సృష్టించారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూనికార్న్స్ 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకొని అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. సంజయ్ కృష్ణమూర్తి (40 బంతుల్లో 92; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి నైట్‌రైడర్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించాడు.
అతనికి హస్సన్ ఖాన్ (17 బంతుల్లో 35)చ, హమ్మద్ ఆజమ్ (27 బంతుల్లో 27), జేవియర్ బార్ట్‌లెట్ (13 బంతుల్లో 27) కూడా తోడవ్వడంతో ఓ దశలో యూనికార్న్స్ సంచలన విజయం సాధించేలా కనిపించింది. అయితే చివర్లో హోల్డర్, డొమినిక్ డేక్స్, వాన్ స్కాల్విక్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో యూనికార్న్స్ లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది.
హోల్డర్, డొమినిక్ డేక్స్, వాన్ స్కాల్విక్ చివరి 3 ఓవర్లు అద్భుతంగా వేసి కీలక వికెట్లు తీశారు. ఈ గెలుపు ఇదివరకే లీగ్ నుంచి నిష్క్రమించిన నైట్‌రైడర్స్‌కు కంటితుడుపుగా వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో యూనికార్న్స్ మూడో స్థానానికి పరిమితమై ఎంఐ న్యూయార్క్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది.
ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరిన ఎంఐ న్యూయార్క్
ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ వాషింగ్టన్ ఫ్రీడం చేతిలో ఓడినా సీయాటిల్ ఓర్కాస్‌తో పోటీ పడి (రన్‌రేట్ విషయంలో) నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ఎంఐపై గెలుపుతో వాషింగ్టన్ ఫ్రీడం టాప్ ప్లేస్‌ను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయర్-1లో వాషింగ్టన్, టెక్సాస్ జట్లు తలపడనున్నాయి.
ఐదో శతకం.. ఈ సీజన్‌లో రెండోది
ఈ మ్యాచ్‌లో ఫ్లెచర్ చేసిన సెంచరీ ఈ సీజన్‌లో అతనికి రెండవది. కొద్ది రోజుల కిందట ఇతను వాషింగ్టన్ ఫ్రీడంపై మెరుపు శతకం (104) బాదాడు. ఓవరాల్‌గా ఫ్లెచర్‌కు ఇది టీ20ల్లో ఐదవ సెంచరీ. ఈ సెంచరీతో ఫ్లెచర్ కొలిన్ మున్రో, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మలాన్ లాంటి విధ్వంసకర వీరుల సరసన చేశాడు. వీరంతా టీ20ల్లో తలో 5 సెంచరీలు చేసిన వారిలో ఉన్నారు.