
జమైకా వేదికగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 181 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
కెమరూన్ గ్రీన్ (42), పాట్ కమిన్స్ (5) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, షమార్ జోసఫ్ 2, జస్టిన్ గ్రీవ్స్ ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా 14, సామ్ కొన్‌స్టాస్ 0, స్టీవ్ స్మిత్ 5, ట్రవిస్ హెడ్ 16, బ్యూ వెబ్‌స్టర్ 13, అలెక్స్ క్యారీ 0 పరుగులకు ఔటయ్యారు.
అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. 36 పరుగులు చేసిన జాన్ క్యాంప్‌బెల్ విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా ఆటగాళ్లలో షాయ్ హోప్ (23), జస్టిన్ గ్రీవ్స్ (18), రోస్టన్ ఛేజ్ (18), బ్రాండన్ కింగ్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 3, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో 2, స్టార్క్, వెబ్‌స్టర్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (46), స్టీవ్ స్మిత్ (48) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఖ్వాజా (23), హెడ్ (20), క్యారీ (21), కమిన్స్ (24) 20ల్లో ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో షమార్ జోసఫ్ 4, గ్రీవ్స్, జేడన్ సీల్స్ తలో 3 వికెట్లు తీశారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది.