
బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య (Bangladesh Vs West Indies) ఇవాళ (అక్టోబర్ 21) ఉత్కంఠ సమరం జరిగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది.
స్పిన్నర్లకు స్వర్గధామమైన ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. ఊహించిన విధంగానే పిచ్ సహకరించడంతో విండీస్ స్పిన్నర్లు చెలరేగిపోయారు.
బంగ్లాదేశ్‌ను 213 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు. మోటీ 3, అకీల్ హోసేన్, అలిక్ అథనాజ్ తలో 2 వికెట్లు తీశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేసిన సౌమ్య సర్కార్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో రిషద్ హొసేన్ (39 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ కూడా తడబడింది. ఓ దశలో పూర్తిగా చేతులెత్తేసింది. అయితే షాయ్ హోప్ (53 నాటౌట్) టెయిలెండర్ల సహకారంతో మ్యాచ్‌ను చివరి బంతివరకు తీసుకొచ్చాడు. చివరి బంతికి 3 పరుగులు అవసరం కాగా.. ఖారీ పియెర్రీ రెండు పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. ఛేదనలో విండీస్ 9 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో విండీస్ ఓ కనీవినీ ఎరుగని రికార్డు సెట్ చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో 50 ఓవర్లను స్పిన్నర్లతో బౌలింగ్ చేయించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
ఈ గెలుపుతో విండీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. నిర్ణయాత్మక చివరి వన్డే ఢాకా వేదికగానే అక్టోబర్ 23న జరుగనుంది.
చదవండి: పాకిస్తాన్ మరో ఫార్మాట్ కెప్టెన్‌గా ఇంకో అఫ్రిది