సాక్షి, హైదరాబాద్: క్యారమ్ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో తెలంగాణ ఆటగాడు శ్రీనివాస్ ‘ట్రిపుల్’ ధమకా సాధించాడు. మాల్దీవులులో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో అతను మూడు పతకాలు సాధించడం విశేషం. స్విస్ లీగ్ ఈవెంట్‌లో కాంస్యం నెగ్గిన ఈ సీనియర్ ప్లేయర్... పురుషుల డబుల్స్‌లో అభిజిత్ త్రిపాంకర్‌తో కలిసి టైటిల్ సాధించాడు. పురుషుల వ్యక్తిగత ఫైనల్లో ప్రశాంత్ మోరే చేతిలో ఓడిపోవడంతో రజతం సాధించాడు.
టైటిల్ పోరులో హైదరాబాదీ ప్లేయర్ 25–5, 11–25, 18–25తో ప్రశాంత్ మోరె చేతిలో కంగుతిన్నాడు. తద్వారా స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో శ్రీనివాస్ ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించాడు. బంగారు పతకాలన్నీ భారత జట్టుకే లభించడం మరో విశేషం. పురుషుల డబుల్స్‌లో స్వర్ణంతో పాటు రజతం కూడా భారత జోడీలకే దక్కాయి.
దీంతో భారత్ 7 పసిడి పతకాలు సహా 4 రజతాలు, 3 కాంస్యాలతో మొత్తం 14 పతకాలు నెగ్గింది.


