
భారతకాలమానం ప్రకారం రేపు (మే 29) సాయంత్రం 5:30 గంటలకు వెస్టిండీస్‌తో జరుగబోయే తొలి వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఐపీఎల్-2025 స్టార్ త్రయం జోస్ బట్లర్ (గుజరాత్ టైటాన్స్), విల్ జాక్స్ (ముంబై ఇండియన్స్), జేకబ్ బేతెల్‌కు (ఆర్సీబీ) చోటు దక్కింది.
వీరితో పాటు సీఎస్‌కే బౌలర్ జేమీ ఓవర్టన్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లిష్ జట్టుకు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు. బట్లర్, బేతెల్, జాక్స్ ఐపీఎల్‌లో తమ జట్లు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉన్నా లీగ్ మ్యాచ్‌లు పూర్తి కాగానే జాతీయ విధులకు హాజరయ్యారు. ఈ ముగ్గురు లీగ్ దశలో తమతమ జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు.
రేపు విండీస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో జేమీ స్మిత్, బెన్ డకెట్ ఓపెనింగ్ చేస్తారు. వెటరన్ ఆటగాడు మూడో స్థానంలో, కెప్టెన్ బ్రూక్ నాలుగో స్థానంలో, బట్లర్, బేతెల్, జాక్స్, ఓవర్టన్ వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగుతారు. గాయం కారణంగా ఐపీఎల్ ప్రారంభానికి ముందే వైదొలిగిన బ్రైడన్ కార్స్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జోఫ్రా ఆర్చర్ కూడా తొలుత ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్ ఐపీఎల్ సందర్భంగా గాయపడటంతో అతని స్థానంలో సాకిబ్ మహమూద్‌ను ఎంపిక చేసుకుంది ఇంగ్లిష్ మేనేజ్‌మెంట్. రేపటి మ్యాచ్‌కు అతను కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మొత్తంగా చూస్తే, రేపు విండీస్‌తో తలపడబోయే ఇంగ్లిష్ జట్టు ఐపీఎల్ డూప్ జట్టుగా కనిపిస్తుంది.
విండీస్‌తో తొలి వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టు..
బెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బేతెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్.
ఇదిలా ఉంటే, రేపటి మ్యాచ్ కోసం విండీస్ తుది జట్టును ప్రకటించాల్సి ఉంది. మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం విండీస్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్, ఆతర్వాత టీ20 సిరీస్ జరుగుతాయి. మే 29, జూన్ 3 తేదీల్లో వన్డేలు.. 6, 8, 10 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి.
పూర్తి జట్లు..
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కీసీ కార్టీ, షాయ్ హోప్(w/c), అమీర్ జాంగూ, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, అల్జారి జోసెఫ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్, జెడియా బ్లేడ్స్, జ్యువెల్ ఆండ్రూ, జేడెన్ సీల్స్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, షిమ్రాన్ హెట్‌మైర్
ఇంగ్లండ్: బెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్(c), జోస్ బట్లర్(wk), జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ల్యూక్ వుడ్, టామ్ బాంటన్, మాథ్యూ పాట్స్, టామ్ హార్ట్లీ