
ఐర్లాండ్ క్రికెట్ జట్టు స్వదేశంలో ఆరేళ్ల తర్వాత తొలిసారి వెస్టిండీస్‌తో తలపడేందుకు సిద్దమైంది. వైట్ బాల్ సిరీస్‌లు ఆడేందుకు విండీస్ జట్టు ఐర్లాండ్ పర్యటనకు రానుంది. ఈ టూర్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరగనుంది.
ఈ క్రమంలో విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఐర్లాండ్ బుధవారం ప్రకటించింది. రెండు ఫార్మాట్లలోనూ ఐర్లాండ్ జట్టు కెప్టెన్‌గా పాల్ స్టిర్లింగ్ ఎంపికయ్యాడు. అదేవిధంగా ఈ జట్లలో ఎక్కువగా యువ ఆటగాళ్లకు ఐరీష్ సెలక్టర్లు చోటు కల్పించారు.
టాప్-ఆర్డర్ బ్యాటర్ కేడ్ కార్మైకేల్, పేసర్ టామ్ మేయెస్‌లు తొలిసారి ఐర్లాండ్ వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ లియామ్ మెక్‌కార్తీని టీ20 జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. యువ ఆటగాళ్లతో పాటు హ్యారీ టెక్టర్, జోష్ లిటిల్, జార్జ్ డాక్రెల్, కర్టిస్ కాంఫర్ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఈ జట్టులో ఉన్నారు. మే 21న డబ్లిన్ వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో విండీస్ జట్టు ఐర్లాండ్ పర్యటన ప్రారంభం కానుంది.
విండీస్‌తో వన్డే సిరీస్‌కు ఐరీష్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బాల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, కేడ్ కార్మైకేల్, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, టామ్ మేయెస్, ఆండ్రూ మెక్‌బ్రైన్, బారీ మెక్‌కార్తీ, లియామ్ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, క్రెయిగ్ యంగ్
విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఐరీష్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, లియామ్ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్