
పసికూన నేపాల్ (Nepal) చేతిలో 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన వెస్టిండీస్‌కు (West Indies) కంటితుడుపు విజయం దక్కింది. మూడో మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన నామమాత్రపు చివరి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకొని పరువు కాపాడుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన విండీస్.. నేపాల్‌ను 19.5 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూల్చింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రామన్ సిమ్మండ్స్ (3-0-15-4) నేపాల్ పతనాన్ని శాశించాడు.
జేడియా బ్లేడ్స్ (3.5-0-20-2), కెప్టెన్ అకీల్ హోసేన్ (4-0-26-1), జేసన్ హోల్డర్ (3-0-19-1) తలో చేయి వేశారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ కుషాల్ భుర్టెల్ (39) టాప్ స్కోరర్ కాగా.. కుషాల్ మల్లా (12), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (17), గుల్సన్ షా (10), సందీప్ జోరా (14) రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని విండీస్ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్లే స్కోర్ మొత్తాన్ని కొట్టేశారు. ఆమిర్ జాంగూ 74, అకీమ్ అగస్టీ 41 పరుగులతో అజేయంగా నిలిచి విండీస్‌ను విజయతీరాలకు చేర్చారు. విండీస్ 12.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
కాగా, ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో నేపాల్ విండీస్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఐసీసీ అసోసియేట్ దేశమైన నేపాల్ ఫుల్ టైమ్ మెంబర్ అయిన విండీస్‌ను చిత్తు చేసి పలు రికార్డులు సొంతం చేసుకుంది.
విండీస్ జట్టు రేపటి నుంచి భారత్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (India vs West Indies) ఆడనుంది. తొలి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా రేపటి నుంచి (అక్టోబర్ 2) ప్రారంభం కానుంది. అనంతరం అక్టోబర్ 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో రెండో టెస్ట్ జరుగుతుంది.
ఈ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. జియో హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
విండీస్ సిరీస్‌కు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్‌కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్
వెస్టిండీస్: రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, తేజ్‌నరైన్ చంద్రపాల్, జాన్ క్యాంప్‌బెల్, జోహన్ లేన్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, జెడియా బ్లేడ్స్, జేడన్ సీల్స్, ఖారీ పియెర్
చదవండి: IND VS AUS: విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ