breaking news
Rohit Paudel
-
పరువు కాపాడుకున్న విండీస్.. కంటితుడుపు విజయం
పసికూన నేపాల్ (Nepal) చేతిలో 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన వెస్టిండీస్‌కు (West Indies) కంటితుడుపు విజయం దక్కింది. మూడో మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన నామమాత్రపు చివరి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకొని పరువు కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన విండీస్.. నేపాల్‌ను 19.5 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూల్చింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రామన్ సిమ్మండ్స్ (3-0-15-4) నేపాల్ పతనాన్ని శాశించాడు. జేడియా బ్లేడ్స్ (3.5-0-20-2), కెప్టెన్ అకీల్ హోసేన్ (4-0-26-1), జేసన్ హోల్డర్ (3-0-19-1) తలో చేయి వేశారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ కుషాల్ భుర్టెల్ (39) టాప్ స్కోరర్ కాగా.. కుషాల్ మల్లా (12), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (17), గుల్సన్ షా (10), సందీప్ జోరా (14) రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని విండీస్ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్లే స్కోర్ మొత్తాన్ని కొట్టేశారు. ఆమిర్ జాంగూ 74, అకీమ్ అగస్టీ 41 పరుగులతో అజేయంగా నిలిచి విండీస్‌ను విజయతీరాలకు చేర్చారు. విండీస్ 12.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో నేపాల్ విండీస్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఐసీసీ అసోసియేట్ దేశమైన నేపాల్ ఫుల్ టైమ్ మెంబర్ అయిన విండీస్‌ను చిత్తు చేసి పలు రికార్డులు సొంతం చేసుకుంది.విండీస్ జట్టు రేపటి నుంచి భారత్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (India vs West Indies) ఆడనుంది. తొలి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా రేపటి నుంచి (అక్టోబర్ 2) ప్రారంభం కానుంది. అనంతరం అక్టోబర్ 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో రెండో టెస్ట్ జరుగుతుంది.ఈ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. జియో హాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.విండీస్ సిరీస్‌కు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్‌కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్వెస్టిండీస్: రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, తేజ్‌నరైన్ చంద్రపాల్, జాన్ క్యాంప్‌బెల్, జోహన్ లేన్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, జెడియా బ్లేడ్స్, జేడన్ సీల్స్, ఖారీ పియెర్చదవండి: IND VS AUS: విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ -
ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించిన పసికూన
ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. పసికూన నేపాల్ (Nepal) రెండు సార్లు టీ20 ఛాంపియన్లైన వెస్టిండీస్‌పై (West Indies) ద్వైపాక్షిక సిరీస్ (West Indies vs Nepal) గెలిచింది. ఓ ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టుపై నేపాల్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. షార్జా వేదికగా నిన్న (సెప్టెంబర్ 29) రెండో టీ20లో నేపాల్ 90 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు తొలి టీ20లోనూ నేపాల్ వెస్టిండీస్‌కు షాకిచ్చింది. ఆ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో విండీస్‌ను మట్టికరిపించింది.రెండో టీ20 విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. ఓపెనర్ ఆసిఫ్ షేక్ (68 నాటౌట్), సందీప్ జోరా (63) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, కైల్ మేయర్స్ తలో 2, జెడియా బ్లేడ్స్ ఓ వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరుకు మించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. మొహమ్మద్ ఆదిల్ ఆలం (4-0-24-3), కుషాల్ భుర్టెల్ (2.1-1-16-3), దీపేంద్ర సింగ్ ఎయిరీ (3-0-4-1), లలిత్ రాజబంశీ (3-0-13-1) చెలరేగడంతో 17.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటైంది. తద్వారా 90 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. పరుగుల పరంగా ఓ ఐసీసీ అసోసియేట్ జట్టుకు (నేపాల్) ఫుల్ మెంబర్ జట్టుపై (వెస్టిండీస్) ఇదే అత్యంత భారీ విజయం. వెస్టిండీస్ చేసిన 83 పరుగుల స్కోర్, ఓ అసోసియేట్ జట్టుపై ఓ ఫుల్ మెంబర్ జట్టుకు రెండో అత్యల్పం. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 ఇవాళ (సెప్టెంబర్ 30) జరుగనుంది. చదవండి: ఐదు రోజుల్లో మరోసారి భారత్, పాకిస్తాన్ క్రికెట్ సమరం -
నేపాల్ సంచలన విజయం.. వెస్టిండీస్‌కు ఘోర పరాభవం
నేపాల్ క్రికెట్ జట్టు సంచలన విజయం సాధించింది. తొలి టీ20లో వెస్టిండీస్ (WI vs NEP 1st T20)ను 19 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా టెస్టు హోదా ఉన్న జట్టుపై తొలిసారి గెలుపు రుచి చూసింది. కాగా వెస్టిండీస్- నేపాల్ జట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్నాయి.ఇందులో భాగంగా షార్జాలో శనివారం రాత్రి తొలి టీ20 జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. నేపాల్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ (6), ఆసిఫ్ షేక్ (3) పూర్తిగా విఫలం కాగా నేపాల్ కష్టాల్లో పడింది.148 పరుగులుఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రోహిత్ పౌడేల్ (Rohit Paudel) నిలకడగా ఆడుతూ 21 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. మరోవైపు.. గుల్షాన్ ఝా (16 బంతుల్లో 22), దీపేంద్ర సింగ్ (17) ఫర్వాలేదనిపించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నేపాల్ 148 పరుగులు చేయగలిగింది.ఊహించని షాక్వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. నవీన్ బిడైసీ మూడు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అకీల్ హొసేన్‌కు ఒక వికెట్ దక్కింది. అయితే, నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు నేపాల్ ఊహించని షాకిచ్చింది.నేపాళ్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన విండీస్.. 129 పరుగుల వద్ద నిలిచిపోయింది. టాపార్డర్‌లో ఓపెనర్లు కైల్ మేయర్స్ (5), ఆమిర్ జంగూ (19).. అకీమ్ ఆగస్టీ (15) విఫలమయ్యారు. మిగతావారిలో జువెల్ ఆండ్రూ (5), కేసీ కార్టీ (16) తేలిపోగా.. నవీన్ బిడైసీ 22 పరుగులతో విండీస్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.మిగిలిన వారిలో ఫాబియాన్ అలెన్ 19, అకీల్ హొసేన్ 18 పరుగులు చేయగలిగారు. నేపాల్ బౌలర్లలో కుశాల్ భుర్తేల్ రెండు వికెట్లు తీయగా.. దీపేంద్ర సింగ్, కిరణ్ కేసీ, నందన్ యాదశ్, లలిత్ రాజ్‌బన్షీ, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రోహిత్ పౌడేల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. వీరంతా సమిష్టిగా రాణించి నేపాల్‌కు చారిత్రాత్మక విజయం అందించారు.180 మ్యాచ్‌ల తర్వాత..టెస్టు హోదా ఉన్న జట్టుపై నేపాల్‌కు ఇదే తొలి విజయం. ఇందుకోసం నేపాల్‌కు ఏకంగా 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు అవసరం కాగా.. నేపాల్ చేతిలో ఓడిన తొలి ఫుల్ మెంబర్ జట్టుగా విండీస్ చెత్త రికార్డును మూటగట్టుకుంది.ఇక 2022 టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా విండీస్.. నేపాల్ మాదిరే అసోసియేట్ జట్టు అయిన స్కాట్లాండ్ చేతిలో ఓడింది. 2014లో ఐర్లాండ్, 2016లో అఫ్గనిస్తాన్ చేతిలోనూ పరాజయం చవిచూసింది. అప్పటికి ఈ రెండు జట్లు అసోసియేట్ టీమ్‌లే కావడం గమనార్హం. The team from the Land of Everest scales another summit 🧗Nepal shock West Indies by 19 runs in Sharjah 🇳🇵🔥#NEPvWI pic.twitter.com/jfPGN6sTOq— FanCode (@FanCode) September 27, 2025 -
చరిత్ర సృష్టించిన నేపాల్ కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
టీ20 వరల్డ్‌కప్-2024ను నేపాల్ జట్టు ఓటమితో ఆరంభించింది. డల్లాస్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నేపాల్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో నేపాల్ పరాజయం పాలైనప్పటకి ఆ జట్టు కెప్టెన్ రోహిత్ పాడెల్ మాత్రం అరుదైన ఘనత సాధించాడు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఓ జట్టుకు నాయకత్వం వహించిన పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రోహిత్ పాడెల్ రికార్డులకెక్కాడు. 21 ఏళ్ల 276 రోజుల వయస్సులో నేపాల్ జట్టు కెప్టెన్‌గా పాడెల్ వ్యవహరిస్తున్నాడు. ఇంతకముందు ఈ రికార్డు జింబాబ్వే మాజీ కెప్టెన్ ప్రోస్పర్ ఉత్సేయ పేరిట ఉండేది. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో 21 ఏళ్ల 354 రోజుల వయస్సులో జింబాబ్వే జట్టుకు ప్రోస్పర్ ఉత్సేయ సారథ్యం వహించాడు. తాజా మ్యాచ్‌తో ఉత్సేయ ఆల్‌టైమ్ రికార్డును పాడెల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆడిప అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా పాడెల్ నిలిచాడు. ఇప్పటివరకు రికార్డు రషీద్ ఖాన్ (22) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో రషీద్ ఖాన్ రికార్డును పాడెల్ బద్దలు కొట్టాడు. -
విండీస్ ఓపెనర్ ఊచకోత.. బెంబేలెత్తిపోయిన పసికూన
ఐదు మ్యాచ్‌ల అనధికారిక టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్-ఏ జట్టు నేపాల్‌లో పర్యటిస్తుంది. సిరీస్‌లో భాగంగా నిన్న (మే 1) జరిగిన మూడో మ్యాచ్‌లో పర్యాటక జట్టు 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ మెరుపు శతకం (61 బంతుల్లో 119 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) బాది తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ఛార్లెస్ ఊచకోత ధాటికి నేపాల్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ గెలుపుతో విండీస్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో నేపాల్ సంచలన విజయం సాధించగా.. రెండు, మూడు మ్యాచ్‌ల్లో విండీస్ విజయం సాధించింది. ఇవాళ (మే 2) నాలుగో టీ20 జరుగుతుంది.మూడో టీ20 విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. జాన్సన్ ఛార్లెస్ శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఛార్లెస్‌తో పాటు ఆండ్రీ ఫ్లెచర్ (33 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. అలిక్ అథనాజ్ 17, ఫేబియన్ అలెన్ 19 పరుగులు చేసి ఔట్ కాగా.. కీమో పాల్ 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. నేపాల్ బౌలర్లలో కరణ్, సాగర్ ధకల్ తలో వికెట్ పడగొట్టగా.. అథనాజ్ రనౌటయ్యాడు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. విండీస్ బౌలర్ల దెబ్బకు 19.2 ఓవర్లలో 151 పరుగులకే బిచానా సర్దేసింది. విండీస్ బౌలర్లలో హేడెన్ వాల్ష్ 3 వికెట్లు పడగొట్టగా.. గుడకేశ్ మోటీ 2, మాథ్యూ ఫోర్డ్, ఓబెద్ మెక్కాయ్, ఫేబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో లోకేశ్ బమ్, కరణ్ తలో 28 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ సిరీస్‌లో వరుసగా సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. -
రోహిత్ వీరోచిత శతకం.. విండీస్‌కు షాకిచ్చిన నేపాల్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్-ఏ క్రికెట్ జట్టు నేపాల్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) తొలి టీ20 జరిగింది. కిరీటీపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య నేపాల్ తమకంటే చాలా రెట్లు మెరుగైన విండీస్-ఏకు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ విండీస్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ వీరోచిత శతకం బాదాడు. ఫలితంగా నేపాల్ విండీస్‌పై సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. అలిక్ అథనాజ్ (47), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (74), కీసీ మెక్‌కార్తీ (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. నేపాల్ బౌలర్లలో కమల్, దీపేంద్ర, రోహిత్, అభినాష్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (54 బంతుల్లో 112; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత శతకంతో విరుచుకుపడటంతో మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రోహిత్‌కు సహచరుల నుంచి ఎలాంటి సహకారం లభించప్పటికీ ఒంటిచేత్తో తన జట్టును గెలిపించుకున్నాడు. నేపాల్ బ్యాటర్లలో దీపేంద్ర (24), కుశాల్ మల్లా (16), కుశాల్ భుర్టెల్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్, మెక్కాయ్ తలో రెండు వికెట్లు, కీమో పాల్ ఓ వికెట్ దక్కించుకున్నారు. రెండో టీ20 ఇదే వేదికగా రేపు జరుగనుంది. -
చెత్త ఫీల్డింగ్! క్యాచ్ అంటే ఇలా పట్టాలి.. రోహిత్ శర్మ రియాక్షన్! వీడియో
Asia Cup, 2023 India vs Nepal: నేపాల్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కీలక సమయంలో నేపాల్ బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత రోహిత్ ఇచ్చిన రియాక్షన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆసియా కప్-2023లో రెండో మ్యాచ్‌లో భాగంగా భారత జట్టు.. పల్లెకెలె వేదికగా సోమవారం నేపాల్‌తో తలపడుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఆరంభంలో శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ సులభమైన క్యాచ్‌లను వదిలేశారు. చెత్త ఫీల్డింగ్ వల్లే.. వాళ్లు రెచ్చిపోయారు దీంతో లైఫ్ పొందిన నేపాల్ ఓపెనర్లు కుశాల్ భుర్తాల్(38), ఆసిఫ్ షేక్(58) మంచి స్కోర్లు సాధించి జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. టీమిండియా ఫీల్డర్లు చేసిన తప్పిదం వారి పాలిట వరంగా మారిందనడంలో సందేహం లేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చేతులెత్తేసిన ఈ ఇద్దరు బ్యాటర్లు ఈ మేరకు స్కోర్ చేశారంటే అది మన చెత్త ఫీల్డింగ్ వల్లేనని అభిమానులు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అందుకున్న క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. క్యాచ్ పట్టేసిన రోహిత్ శర్మ నేపాల్ ఇన్నింగ్స్ 20వ ఓవర్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ రోహిత్ పౌడేల్ బంతిని తప్పుగా అంచనా వేశాడు. బ్యాక్‌ఫుట్ షాట్ ఆడబోయి ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. ఈ సింపుల్ క్యాచ్‌ను ఒడిసిపట్టేసిన టీమిండియా సారథి సంబరాల్లో మునిగిపోయాడు. రోహిత్ పట్టిన క్యాచ్.. వీడియో వైరల్ అంతేకాదు.. క్యాచ్ అంటే ఇలా పట్టాలి అన్నట్లుగా సహచర ఆటగాళ్ల వైపు ఓ లుక్కేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఇక రోహిత్ శర్మ క్యాచ్‌ను నమ్మలేని... నేపాల్ కెప్టెన్ రోహిత్(5) బిక్కమొఖం వేసి నిరాశగా పెవిలియన్ చేరాడు. వరుణుడి ఆటంకం కాగా 37.5 ఓవర్ల వద్ద వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికి నేపాల్ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజాకు మూడు, సిరాజ్‌కు రెండు, శార్దూల్ ఠాకూర్‌కు ఒక వికెట్ దక్కాయి. ఇదిలా ఉంటే.. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడ్డ టీమిండియాకు వరుణుడు ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ ఇన్నింగ్స్ తర్వాత ఎడతెరిపిలేని వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో చెరో పాయింట్ లభించింది. చదవండి: ఆరోజు నేను- ధోని కాదు.. భజ్జీ గెలిపించాడు! వెటకారమెందుకు గంభీర్? బుద్ధుందా? WC 2023: తిలక్ వర్మను ఎందుకు ఎంపిక చేసినట్లు? అతడు అవసరమా? A remarkable catch by Rohit Sharma has him pumped and energized. #INDvsNEP pic.twitter.com/zLu2klpiY6 — MI Fans Army™ (@MIFansArmy) September 4, 2023 -
IND VS NEP: నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో టీమిండియా విజయం.. సూపర్ 4లో ఎంట్రీ
Asia Cup, 2023 India vs Nepal: ఆసియా వన్డే కప్-2023 టీమిండియా వర్సెస్ నేపాల్ అప్డేట్స్ నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దాంతో టీమిండియా మూడు పాయింట్లతో సూపర్ 4కు చేరుకుంది. రోహిత్ శర్మ (74), శుభ్‌మన్ గిల్ (67) పరుగులతో రాణించారు. వర్షం కారణంగా అంపైర్లు DLS పద్ధతిలో 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు అందించారు. ఈ టార్గెట్‌ను రోహిత్-గిల్ జోడీ 20.1 ఓవర్లలో సాధించారు. టీమిండియా టార్గెట్ 145 వర్షం తగ్గిపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన టీమిండియా టార్గెట్‌ను 145గా నిర్ధేశించారు. 23 ఓవర్లలో భారత్ ఈ టార్గెట్‌ను ఛేజ్ చేయాల్సి ఉంటుంది. వర్షం అంతరాయం.. ఓవర్లు కుదిస్తే భారత్ టార్గెట్ ఎంతంటే..? 45 ఓవర్లలో 220 40 ఓవర్లలో 207 35 ఓవర్లలో 192 30 ఓవర్లలో 174 20 ఓవర్లలో 130 బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. మళ్లీ మొదలైన వర్షం 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు వరుణుడు మరోసారి స్వాగతం పలికాడు. 2 ఓవర్ల తర్వాత వర్షం మళ్లీ మొదలైంది. 2.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 17/0గా ఉంది. శుభ్‌మన్ గిల్ (12), రోహిత్ శర్మ (4) క్రీజ్‌లో ఉన్నారు. రాణించిన జడ్డూ, సిరాజ్.. నేపాల్ 230 ఆలౌట్ వరుణుడి ఆటంకాల నడుమ సాగుతున్న భారత్-నేపాల్ మ్యాచ్‌లో నేపాల్ 230 పరుగులకు ఆలౌటైంది. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్ షేక్ (58), సోంపాల్ కామీ (48), కుషాల్ భుర్టెల్ (38), దీపేంద్ర సింగ్ (29), గుల్షన్ ఝా (23) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. 47 ఓవర్లలో నేపాల్ స్కోరు: 227/7 ఏడో వికెట్ కోల్పోయిన నేపాల్ 41.1: హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో దీపేంద్ర సింగ్ 29(25) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో నేపాల్ ఏడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 194/7 (41.1). సందీప్ లమిచానే, సోంపాల్ కమీ(25) క్రీజులో ఉన్నారు. వర్షం తర్వాత మొదలైన ఆట 40 ఓవర్లలో నేపాల్ స్కోరు: 184-6 భారత్‌తో వర్సెస్ నేపాల్.. మళ్లీ వర్షం మొదలు సమయం సాయంత్రం 05:44: టీమిండియా- నేపాల్ మ్యాచ్‌కు వరణుడు మళ్లీ ఆటంకం కలిగించాడు. స్కోరు: 178/6 (37.5) ఆరో వికెట్ కోల్పోయిన నేపాల్ 31.5: గుల్షన్ ఝా 23(35) రూపంలో నేపాల్ ఆరో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో ఇషాన్‌కు క్యాచ్ ఇచ్చి గుల్షన్ పెవిలియన్ చేరాడు. స్కోరు: 144/6 (31.5) ►మొదలైన ఆట.. చినుకులు తగ్గడంతో మళ్లీ మ్యాచ్ మొదలైంది. ►సమయం సాయంత్రం 05:05: చిరుజల్లులు మొదలుకావడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. 29.5: హాఫ్ సెంచరీ హీరో అవుట్ నిలకడగా ఆడుతున్న నేపాల్ ఓపెనర్ ఆసిఫ్ షేక్(58(97)ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో నేపాల్ ఐదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 132/5 27.2: అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఆసిఫ్ షేక్.. స్కోరు: 114/4 (27.3 25 ఓవర్లలో నేపాల్ స్కోరు: 109-4 21.5: నాలుగో వికెట్ కోల్పోయిన నేపాల్ జడేజా బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన కుశాల్ మల్లా 2(5). అసిఫ్ షేక్ 45, గుల్షన్ ఝా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన నేపాల్.. 20 ఓవర్లలో నేపాల్ స్కోరు 19.6: రవీంద్ర జడేజా మరోసారి తన స్పిన్ బౌలింగ్‌తో మాయ చేశాడు. దీంతో నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడేల్ 5(8) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 20 ఓవర్లలో నేపాల్ స్కోరు: 93-3 18.5: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఆసిఫ్ షేక్ అవుటైనట్లు అంపైర్ సిగ్నల్ ఇవ్వగా రివ్యూకు వెళ్లిన నేపాల్‌కు సానుకూలంగా నిర్ణయం వచ్చింది. స్కోరు: 92/2 (19.4) రెండో వికెట్ కోల్పోయిన నేపాల్ 15.6: రవీంద్ర జడేజా బౌలింగ్‌లో నేపాల్ వన్‌డౌన్ బ్యాటర్ భీమ్ షర్కీ 7(17) బౌల్డ్. దీంతో నేపాల్ రెండో వికెట్ కోల్పోయింది. స్కోరు 77/2 (16). 15 ఓవర్లలో నేపాల్ స్కోరు: 73-1 తొలి వికెట్ కోల్పోయిన నేపాల్ 9.5: ఎట్టకేలకు టీమిండియాకు వికెట్ దక్కింది. పదో ఓవర్ ఐదో బంతికి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కుశాల్ 38(25) [4s-3 6s-2] ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆసిఫ్(23), భీమ్ షార్కీ క్రీజులో ఉన్నారు. దంచికొడుతున్న నేపాల్ ఓపెనర్లు 8.5: హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న నేపాల్. కుశాల్ 29, ఆసిఫ్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న నేపాల్ ఓపెనర్లు.. స్కోరు: 42-0(8) 5 ఓవర్లు ముగిసే సరికి నేపాల్ స్కోరు: 23/0 టీమిండియా ఫీల్డర్లు వరుసగా క్యాచ్‌లు వదిలేస్తున్న క్రమంలో ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ 12, ఆసిఫ్ షేక్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచిన టీమిండియా నేపాల్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘బౌలింగ్ ఎంచుకోవడానికి ప్రత్యేక కారణమేమీ లేదు. గత మ్యాచ్‌లో మెరుగైన స్కోరు కోసం మేము పోరాడాల్సి వచ్చింది. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ పాక్‌తో మ్యాచ్‌లో అద్బుతంగా రాణించారు. ఈసారి బౌలర్లకు అవకాశం ఇవ్వాలని భావించాం’’ అని పేర్కొన్నాడు. బుమ్రా లేడు.. షమీ వచ్చాడు నేపాల్‌తో మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో.. ‘‘వాతావరణం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. బుమ్రా ఈరోజు అందుబాటులో లేడు. కాబట్టి షమీ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక నేపాల్ సారథి రోహిత్ పౌడేల్ ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలిపాడు. ఆరిఫ్ షేక్ స్థానంలో భీమ్ షర్కీ తుది జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. తుది జట్లు ఇవే టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. నేపాల్ కుశాల్ భుర్తేల్, ఆసిఫ్ షేక్(వికెట్ కీపర్), రోహిత్ పౌడెల్(కెప్టెన్), భీమ్ షార్కి, సోంపాల్ కామి, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ మల్లా, సందీప్ లమిచానే, కరణ్ కేసీ, లలిత్ రాజ్‌బన్షీ. ఓడితే అంతే సంగతి ►గ్రూప్-ఏలో భాగమైన నేపాల్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడింది. ముల్తాన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 238 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో పటిష్ట టీమిండియాతో రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇందులో ఓడితే ఇంటిబాట పడుతుంది.


